యంగ్ ట్యాలెంటెడ్ నరేష్ అగస్త్య హీరోగా చైతన్య గండికోట దర్శకత్వంలో డా.ఎం రాజేంద్ర నిర్మాణంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. శ్రేయ రుక్మిణి హీరోయిన్ గా నటిస్తున్నారు. GENIE ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న కొత్త చిత్రం ఈరోజు పూజాకార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయ్యింది.
గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో మాజీ IAS సునీల్ శర్మ, అతని భార్య షాలిని శర్మ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టారు. రఘుబాబు కెమరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ బి. గోపాల్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పలువురు ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. విద్యాసాగర్ చింతా డీవోపీగా పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబధించిన ఇతరనటీనటులు వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం– నరేష్ అగస్త్య, శ్రేయ రుక్మిణి
రచన, దర్శకత్వం- చైతన్య గండికోట
నిర్మాత- డా.ఎం రాజేంద్ర
డీవోపీ- విద్యాసాగర్ చింతా
సంగీతం- మిక్కీ జె మేయర్
ఆర్ట్- షర్మిలా యెలిసెట్టి
ఎడిటర్- కోటగిరి వెంకటేశ్వరరావు
కాస్ట్యూమ్ డిజైనర్- శ్రీవిద్య పి
డైలాగ్ రైటర్- లక్ష్మీ భూపాల
లిరిక్స్- వనమాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- శేఖర్ కందుకూరి
పీఆర్వో – వంశీ – శేఖర్
డిజిటల్ మీడియా – హ్యాష్‌ట్యాగ్ మీడియా

