లాక్ డౌన్ ఈ నెల 14తో ముగుస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంక్ష అనూహ్యంగా పెరగడంతో ఈ నెల 30 వరకు లాక్ డౌన్‌ని కొనసాగించాల్సిందే అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిర్మాతల ప్లాన్ మారింది. సినీ ఇండస్ట్రీకి కీలకమైన సమ్మర్ సీజన్ వెళ్లిపోతుండటంతో నిరమాతలంతా అప్రమత్తమవుతున్నారు.
ఈ నెలాఖరున లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే థియేటర్లు తెరుకునే పరిస్థితి లేదు. మే రెండేఉ లేదా మూడవ వారం వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఒక వేళ మూడవ వారంలో అయినా థియేటర్లు తెరవచ్చు అని ఉత్తర్వులు జారీ చేస్తే ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం కోసం ఏం చేయాలనే దానిపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
థియేటర్లు తెరచినా సోషల్ డిస్టెన్స్ మరో నెల రోజుల పాటైనా పాటించాలి. అందుకు థియేటర్లలో 50 శాతం మాత్రమే టిక్కెట్లు అమ్మాలని, దాని ద్వారా ప్రేక్షకుల మధ్య సోషల్ డిస్టెన్స్ వుంటుంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్‌కు రావడం ఖాయమని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.