Paresh Rawal: నటుడు కమెడియన్ పరేష్ రావల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి టాప్ కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పరేష్ రావల్. ఈయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఈయన ఒక వివాదంలో చెప్పుకున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ సీక్వెల్ హేరా ఫేరి 3 సినిమా నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా 1, 2 పార్టులలో నటించిన ఆయన ఇప్పుడు ఆకస్మాత్తుగా హేరా ఫేరి 3 ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం అందరికి షాక్ ఇచ్చింది.
ఇదే విషయంపై ఇప్పటికే ఆయనకు నిర్మాతలు నోటీసులు కూడా పంపించారట. ఈ సినిమా కోసం అతడు తీసుకున్న రెమ్యునరేషన్ తో పాటు వడ్డీ సహా తిరిగి ఇవ్వాల్సిందే అంటూ నోటీసులు పంపించారట మూవీ మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు పరేష్ రావల్ పర్సనల్ లైఫ్ గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పరేష్ రావల్ చేతిలో ఏకంగా 7 సినిమాల వరకు ఉన్నాయి. ఇక పరేష్ రావల్ ఆస్తుల విషయానికి వస్తే.. ఈయన ఆస్తుల మొత్తం విలువ దాదాపుగా రూ.200 కోట్లు ఉన్నట్లు అంచనా. భారతదేశం లోని అత్యంత ధనవంతులైన కమెడియన్ లలో ఈయన కూడా ఒకరు. అక్షయ్ కుమార్ తో కలిసి వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
పరేష్ 1987లో స్వరూప్ సంపత్ ను వివాహం చేసుకున్నాడు. పరేష్ ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటాడు. హేరా ఫేరి 3 సినిమా కోసం అతను రూ.11 లక్షల అడ్వాన్స్ చెల్లింపు అందుకున్నాడట. మరి ఈ వ్యవహారంపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. అయితే పరేష్ రావల్ ఆస్తుల గురించి తెలిసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. మరి నిర్మాతలు అడిగినట్టు పరేష్ రావల్ అడ్వాన్స్ ని తిరిగి వెనక్కి ఇస్తాడా, లేదంటే సినిమాలో నటిస్తాడా అన్నది చూడాలి మరి. ఈ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందీ.