రాజమౌళి చేత విడుదల కానున్న స్టార్ హీరో టైటిల్

స్టార్ హీరో అంటే హీరోనే కానీ ప్రస్తుతం స్టార్ మాత్రం తన కెరీర్లో లేకుండా పోయిన దక్షిణాది హీరో సూర్య. వరస ప్లాప్ల తో ఆయన కెరీర్ డీలా పడింది. అయితే సినిమాలకేమీ లోటు లేదు కానీ ఆయన మార్కెట్ కుదేలు అయిపొయింది తాజాగా వచ్చిన ఎన్జీకె సినిమాతో. అందువల్ల మళ్ళీ తన దశ తిరగడానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళిని ఆశ్రయించాడు సూర్య.

ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘కాపాం’. ఈ థ్రిల్లర్ చిత్రానికి కెవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు టైటిల్ ను రాజమౌళి జూన్ 27 పొద్దున్న 10.30  గంటలకి విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో మలయాళం నటుడు మోహన్ లాల్, మరియు హీరో ఆర్య కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ సయేశా సూర్య కి జోడీగా నటించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.