యు సర్టిఫికెట్ తెచ్చుకున్న శ్రీ విష్ణు ‘బ్రోచేవారెవరురా’

హీరో శ్రీ విష్ణు కు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి మూస ధోరణికి విరుద్ధంగా సినిమాలు చేస్తాడనే పేరు ఉంది. అదే కోవలో ఆయన చేసిన, చేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన ‘బ్రోచేవారెవరురా’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి ఏ మాత్రం కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మొదలైన వారు ఉండగా నివేద థామస్ శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 28 విడుదల అవుతోంది.