జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గనుక మద్దతివ్వకపోయుంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు! అన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొన్ని చీకటి ఒప్పందాలు కుదిరాయని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత కొన్నాళ్టకి టీడీపీ తో తెగ తెంపులు చేసేసుకుని పవన్ దారి పవన్ చేసుకున్నారు. అయినా సరే పవన్ ఇప్పటికీ చంద్రబాబు డైరెక్షన్ లో రాజకీయంగా ముందుకెళ్తున్నారని, సొంత ఎజెండాలేని పార్టీ అంటూ వైకాపా తూర్పూరాపడుతునే ఉంటుంది.
ప్రస్తుతం జనసేన కలిసి ప్రయాణం చేసేది బీజేపీతో అయినా! చిలవలు ఫలవులుగా ఇప్పటికీ చంద్రబాబు వెనుక పవన్ ఉన్నారనే ఆరోపణలు ఎప్పటికప్పుడు హీటెక్కిస్తుంటాయి. ఆ మ్యాటర్ కాసేపు పక్కనబెట్టి అసలు విషయంలోకి వస్తే రాంగోపాల్ వర్మ `పవర్ స్టార్` టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అచ్చం పవన్ కళ్యాణ్ లా ఉండే ఓ వ్యక్తిని తీసుకొచ్చి పవన్ ఆహార్యం అద్ది ఈ సినిమా తీస్తున్నాడు. పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన జీవితం ఎలా సాగింది అన్న అంశాల్నే సినిమాలు హైలైట్ చేస్తున్నట్లు వర్మ చెప్పకపోయినా చేసేది అదేనని రిలీజ్ చేస్తోన్న పోస్టర్లను బట్టి ఓ క్లారిటీ వచ్చేసింది.
తాజాగా మరో కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రధారి-చంద్రబాబు నాయుడు పాత్ర దారి ఓ చీకటి గదిలో నల్ల సోపాల మీద కూర్చొని సీరియస్ గా మంతనాలు చేస్తున్నట్లు రివీల్ చేసారు. ఇద్దరి మధ్య అది రాజకీయ భేటి అని స్పష్టంగా అర్ధమవుతోంది. మరీ లైట్లు ఆపేసి పోస్టర్ కట్ చేస్తే కనిపిందు కాబట్టి ఆ రెండు ముఖాలు కనిపించేలా లైటింగ్ వాళ్ల మీద పడేలా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ పై పొలిటికల్ కారిడార్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఈ పాత్రలను వర్మ తెరపై ఎలా మలచబోతున్నాడో.