పేరు మార్చుకున్న సమంత

అదేంటి, ఇప్పటికే సమంత రూత్ ప్రభు నుంచి సమంత అక్కినేని అయింది కదా ఇంకేం మార్చుకుంది అని మీకు అనుమానం వచ్చిందా? అవునండీ ఈ సారి ట్విట్టర్ లో తన ఖాతా పేరును ‘బేబీ అక్కినేని’ గా మార్చుకుంది.

బేబీ అక్కినేని అంటే అదేనండీ సమంతా కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా చేసిందన్న మాట. ఆమె నటించిన ‘ఓహ్ బేబీ’ సినిమా జులై 5న విడుదల అవుతోంది. ఈ క్రమంలో ఆమె ఈ సినిమా ప్రొమోషన్స్ లో తీరిక లేకుండా ఉంది. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య కాగా కారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మి కీలక పాత్ర పోషించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సినిమాను ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు.