వెటర్నరీ డాక్టర్ అయిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ రేప్ అండ్ మర్డర్ విషయం పై లేటుగా స్పందిస్తూ ఘాటుగా మాట్లాడింది జబర్దస్త్ బ్యూటీ. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా… హాట్ యాంకర్ అనసూయ. వస్త్రధారణ, ఎక్స్ పోజింగ్ తదితర విషయాల్లో తరచూ స్పందించే అనసూయ.. సాటి మహిళలను దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే ప్రపంచం మొత్తం ఈ ఇష్యూ బర్నింగ్ అవుతుండగా.. అనసూయ మాత్రం స్పందించకపోవడంతో చాలా మంది నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది అనసూయ.
ఇక ఇదిలా ఉంటే…దిశ ఘటనలో రేపిస్టులకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు కొంతమంది కామాంధులు. వాటి స్క్రీన్ షాట్స్‌ను చూపిస్తూ ఏకిపారేసింది అనసూయ. ‘సినిమా వాళ్ల వల్లే యూత్ తప్పుదారి పడుతున్నారు. సెక్స్, ఎక్స్ పోజింగ్, బూబ్స్, థైస్ ఇలా ఒక్కటేమిటి.. అన్నీ మొత్తం విప్పిచూపిస్తున్నారు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి మీ ఎక్స్ పోజింగ్ చూసి లె****ల్సిందే. లేచాక ఏడ పెడతాడు. ఇదిగో ఇలా రేప్‌లు చేసి ఏడుస్తాడు’ అంటూ జేకే క్రిష్ణ అనే నీచుడు కామెంట్ చేశాడని ఆ స్క్రీన్ షాట్ చూపించింది అనసూయ.‘దిశ రాత్రి టైంలో బ్యూటీ పార్లర్‌కి ఎందుకు వెళ్లాలి.. వెళ్లకుండా ఉంటే రేప్ జరిగి ఉండదు కదా.. రాత్రి టైంలో కనిపించే సరికి రేప్ చేశారు. ఆ తరువాత మర్డర్ చేశారు. ఇందులో తప్పేం ఉంది’ అంటూ సందీప్ కుమార్ అనే కామాంధుడు కామెంట్ చేశాడని ఆ స్క్రీన్ షాట్ చూపిస్తూ భావోద్వేగానికి గురైంది అనసూయ.
‘దిశను రేప్ చేసిన వాళ్లకు కూడా స్వేచ్ఛ ఉంది. దిశ ఆ టైప్ అని కన్ఫామ్ చేసుకున్న తరువాతే రేప్ చేశారు.. దిశది కూడా తప్పు ఉంది’ అని మరో కామాంధుడు కామెంట్ చేశాడు. అసలు వీళ్లు ఎవరు మమ్మల్ని జడ్జ్ చేయడానికి అంటూ రెచ్చిపోయింది అనసూయ. ఇక అసలు ఆడపిల్ల అలా ఉండాలి? ఇలా ఉండాలి అంటూ చెప్పడానికి వీళ్ళెవరు? ఏం బట్టలు వేసుకోవాలో మీరే చెప్తారా? అయినా నాకు అవసరమైన వాటి పై స్పందిస్తా. నేను ఈ విషయం పై ప్రిపేర్ కాలేదు అందుకే స్పందించలేదు. ఈ ఘటన పైన నేను కూడా బాధపడ్డాను అది మాటల్లో చెప్పలేను. అలాగని అందరిలాగా ఒక ట్వీట్ పెట్టి చేతులు దులుపుకోలేను.
నాకు ఎంతో బాధ అనిపించి ఇలా మాట్లాడుతున్నా.. గతంలో కూడా ఆడవారి పై చాలా అఘాయిత్యాలు జరిగాయి దాని పై మీరేం పీకారు. ఢిల్లీలో రేప్ జరిగింది.. మరణశిక్ష వేశారు.. ఒక్కడికైనా అమలు చేశారా?
ముందు బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసుకోండి. ఇంట్లో నుండే మొదలవ్వాలి.. అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో అంటూ చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యింది అనసూయ. కానీ చెప్పాలంటే నిజంగానే ఒకరు డిసైడ్ చేసేదేంటి మనం ఎలా ఉండాలి అన్నది. ముందు పద్ధతి నేర్చుకోవాలి. అంతే తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు.