‘తబ్లిగీ జమాత్` ఈ పేరు వింటేనే తెలుగు రాష్ర్టాలు ఇప్పుడు గడగడలాడిపోతున్నాయి. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేద్దాం !అనుకుంటోన్న సమయంలో తబ్లిగీ జమాత్ ఒక్కసారిగా అలజడి రేపింది. దేశ వ్యాప్తంగా..తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కోరలు చాచి విరుచుకుపడింది. దానంతటికీ కారణంగా తబ్లీగ్ జమాత్. వేలాది మంది ముస్లీంలు పాల్గొన్న ప్రార్ధనలో కరోనా ఎవరెవరికీ సోకిందని ఇప్పటీకీ ప్రభుత్వాలు ఆరా తీస్తూనే ఉన్నాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు క్వారంటైన్లోకి తొస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు అదేశాలు జారీ చేయడంతో ప్రజల గుండెలో పిడుగు పడినంత పనైంది.
నిజాముద్దీన్ ప్రార్ధనకు వెళ్లోచ్చిన వారు ఎంత మందిని టచ్ చేసి ఉంటారో? అన్న భయం గుప్పెట్లో బ్రతకాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క శ్రీకాకుళం…విజయనగరం జిల్లాలు మినహా రెండు రాష్ర్టాల్లోనూ దాదాపు అదే పరిస్థితి. మరి ఈ ప్రభావం తాజాగా టాలీవుడ్ పై పడిందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. పలు నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ముస్లీంలు మర్కజ్ వెళ్లొచ్చినట్లు…అటుపై సినిమా ఇండస్ర్టీలో కొంత మందితో సన్నిహితంగా మెలిగినట్లు ఇన్ సైడ్ టాక్ వేడెక్కిస్తోంది. ముఖ్యంగా ఓ నలుగురు ముస్లీం సోదరులు ఓ అగ్ర నిర్మాణ సంస్థలో పదేళ్లగా పనిచేస్తున్నారుట. ఆ సంస్థలో నిర్మాణం జరిగే సినిమాలకు హైదరాబాద్ బిర్యానీ తయారు చేస్తారుట. ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లినా ఆ నలుగురు కచ్చితంగా యూనిట్ పాటు వెళ్తారుట.
అదే సంస్థతో పదేళ్లగా అనుబంధం ఏర్పడటంతో సదరు నిర్మాత ఆ నలుగుర్ని తన ఫ్యామిలీ మెంబర్లలా భావిస్తారుట. ఆ కారణంగా ఆ నలుగురు మర్కజ్ వెళ్లిచ్చిన తర్వాత ఆ నిర్మాత ఇటీవలే ఇంట్లో చిన్న ఈవెంట్ జరిగితే బిరియానీ సహా ఇతర ఆహార పదార్థాలు ఆ నలుగురే దగ్గరుండి ప్రిపేర్ చేసారుట. ఆ నిర్మాత కూడా టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారుట. ఆ కారణంగా ఇప్పుడు టాలీవుడ్ కరోనా కలకలం రేగిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.