కమల్‌హాసన్ సినిమా అంటే ఒకప్పుడు లిప్‌లాక్ ఖచ్చితంగా వుండాల్సిందే. సరిత దగ్గరి నుంచి రాణీముఖర్జీ వరకు కమల్ ముద్దు పెట్టని హీరోయిన్ లేదు. ఇప్పుడు అదే ఆయనను ఇప్పుడు చిక్కుల్లో పడేస్తోంది. 1986లో వచ్చిన తమిళ చిత్రం `పున్నగై మన్నన్`. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కమల్‌హాసన్, రేవతి, రేఖ హీరో హీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో వాటర్ ఫాల్స్ నుండి దూకి కమల్, రేఖ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు.
అయితే ఆ సన్నివేశంలో తన అనుమతి లేకుండానే తనని కమల్ కిస్ చేయడం షాక్‌కు గురిచేసిందని నటి రేఖ ఇన్నేళ్ల తరువాత ఆ సంఘటనని గుర్తు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా కమల్‌పై రేఖ ఈ వ్యాఖ్యలు చేయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు ముందు ఈ సన్నివేశంలో ముద్దు సీన్ వుందని దర్శకుడు కె. బాలచందర్ కానీ కమల్‌హాసన్ కానీ చెప్పలేదని, ఈ సీన్ తరువాత దర్శకుడిని వెళ్లి అడిగితే అందులో తప్పేముందని కవర్ చేసుకున్నారని, ఈ ముద్దు సీన్ కొన్ని నెలల పాటు మనో వేదనకు గురిచేసిందని రేఖ వెల్లడించడం కొత్త వివాదానికి తెరలేపింది.
దీనిపై మీటూ వాదులు ఎలా స్పందిస్తారోనని, అసలే `ఇండియన్ 2` సెట్ ప్రమాదం కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న కమల్‌కు తాజా వివాదం మరింత ఆందోళనకు గురిచేసేలా వుందని చెన్నై సినీ వర్గాలు అంటున్నాయి.