రామ్ గోపాల్‌వర్మ గత కొంత కాలంగా బయట కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్నారు. ఇక కరోనా వైరస్ ప్రబలడం మొదలైన దగ్గరి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ కరోనా జపం చేస్తున్నారు. ఏరోజూ ఫేక్ న్యూస్‌లకు స్పందించని వర్మ కరోనా కారణంగా ఓ ఫేక్ న్యూస్‌కి అడ్డంగా బుక్కయిపోయాడు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్యం దొరక్క పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి కోసం ఇంటింటికి మధ్యం సరఫరా చేస్తోందని ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వార్తని నిజమని నమ్మిన రామ్ గోపాల్ వర్మ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని అభ్యర్థించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేస్తున్న పనే మీరూ చేస్తే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా విన్నవించారు. అయితే దీనికి కేటీఆర్ సమయస్ఫూర్తితో స్పందించి `వర్మగారు మీరు మాట్లాడుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటా` అని దమ్మదిరిగే పంచ్ ఇచ్చారు.
ఆదివారం ఈ పంచ్‌కు వర్మ రిప్లై ఇచ్చారు. `కేటీఆర్ సార్ మీ ట్వీట్ చూసుకోలేదు. మీ హాస్య చతురత అంటే నాకు చాలా ఇష్టం. మీ బాక్సింగ్ పంచ్‌కు నా ముక్కు ఎర్రగా వాయిపోయింది. మీ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్ని మెచ్చుకుంటున్నా` అని ట్వీట్ చేశాడు.