పేరుకు తమిళ నటుడే కానీ కార్తికి తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఖైదీతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో దొంగపై భారీ అంచనాలున్నాయి. దానికితోడు దృశ్యం లాంటి సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ చిత్రంతో కార్తి ఎంతవరకు ఆకట్టుకున్నాడు..? ఖాకీ, ఖైదీ, ఇలా వరస బ్లాక్ బస్టర్లతో తెలుగు ఇండస్ట్రీ దున్నేస్తున్నారు. తాజాగా విడుదలైన దొంగ బాక్సాఫీసు ముందు ఖైదీ చిత్రం ఏ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయా లేదో ఓ లుక్కేద్దాం.
తమిళంలో తంబి చిత్రం తెలుగు అనువాదమే దొంగ చిత్రం. ఈ చిత్రంలో కార్తీ వదిన నటుడు సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటించారు. సత్యరాజ్, నిఖిల, షావుకారు జానకి పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
కార్తీ గత చిత్రం ఖైదీ తెలుగులో అనువాదం విడుదలై అఖండ విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో థియేటర్లను కేటాయించారు. ఖైదీ సినిమా విడుదల సమయంలో తెలుగులో పెద్ద హీరో చిత్రాలు ఏమీ లేకపోవడంతో. దీంతో ఖైదీ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే దొంగ సినిమాకు అటూ టావీవుడ్ అగ్రకథానాయకుడు బాలకృష్ణ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ రూలర్. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే, దబాంగ్ -3లాంటి అనువాద సినిమాలు రేసులో ఉన్నాయి. దీంతో దొంగకి కాస్త థియేటర్లు కస్టమయ్యాయి. దొంగ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20-25లక్షలు వసూళ్ల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ సారి భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం కాస్త తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఖైదీ విడుదలకు ఇతర సినిమాలు పోటీ ఉండడంతో 3.5కోట్ల మేర బిజినెస్ మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. దొంగ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ సాధించాలంలే కనీసం రూ.4 కోట్లు రాబట్టాల్సిందే. మరి ఎంత కలెక్ట్ చేస్తుందో ఈ క్రిస్‌మస్ సెలవలు దొంగకి ఏమన్నా హెల్ప్ అవుతాయేమో చూడాలి.