పాత సినిమాల్లోనే బికినీ వేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్స్ బికినీలు వేయడం కామన్ అయిపొయింది. సాంగ్స్ లో అందాల భామలు ఎంత గ్లామర్ గా, పొట్టి బట్టలతో కనిపిస్తే అంత పాపులారిటీ వస్తుంది. సౌత్ సినిమాలలో అయితే అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కాని నార్త్ ఇండియన్ సినిమాలలో బికినీ అనేది చాలా క్యూజువల్ కాస్ట్యూమ్ గా మారిపోయింది. టూ పీస్ బికినీ సన్నివేశాలు అయితే ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు రొటీన్ అయిపోయాయి.

ఇక సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అందాల భామలు ఫోటో షూట్ ల కోసం కూడా బికినీ కాస్ట్యూమ్స్ వేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ భంగిమలతో బికినీ లలో అందాలు ఆరబోస్తూ ఫోజులు ఇస్తున్నారు. ఇలాంటి ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్లామర్ బ్యూటీస్ కి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఒక ఆదాయ మార్గంగా మారిపోయింది.

ఎంత ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. అలా ఆకర్షించడానికి అందాల ప్రదర్శన హీరోయిన్స్ ఆయుధంగా మారుతోంది. అయితే ఇప్పుడంటే బికినీలు కామన్ అయిపోయాయి కాని పాతకాలం సినిమాలలో ఎక్కువగా ఇండియన్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ మాత్రమే హీరోయిన్స్ వేసేవారు. అల్ట్రా మోడరన్ రోల్స్ చేసిన కూడా నిండుగానే డ్రెస్సులు ఉండేవి.

అయితే చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాత్రం 90వ దశకంలో కూడా బికినీలు వేశారు. ఖైది సినిమాలో చిరంజీవితో జత కట్టిన మాధవి కూడా టూ పీస్ బికినీ వేసింది. కమల్ హాసన్ తో ఆమె నటించిన ఓ తమిళ్ సినిమా కోసం బికినీ ధరించింది. తరువాత జయసుధ అలా బికినీ షూట్ లో 1970లో ఓ చిత్రంలో కనిపించి అలరించింది. ఆ రోజుల్లో బికినీ వేయడం అంటే పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. దీంతో జయసుధ వేసిన స్విమ్ షూట్ ఫోటోలు చాలా పాపులర్ అయ్యాయి.

13 ఏళ్ళ వయస్సులోనే పండంటి కాపురం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జయసుధ సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా చాలా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. 20 దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా తన జోరు కొనసాగించింది. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో తల్లి పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.