ప్చ్… “ఖైదీ” రీమేక్ ని కంపు చేసి పారేసేలా ఉన్నారే..!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా సహా హిందీలో కూడా పలు భారీ సినిమాలు తో పాటుగా రీమేక్ చిత్రాలు కూడా గట్టిగానే వస్తున్నాయి. అలాగే ఈ చిత్రాలు కూడా పెద్దగా థియేటర్స్ లో ఆడని పడని పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఈ చిత్రాల్లో సౌత్ భారీ హిట్ చిత్రం “ఖైదీ” హిందీలో రీమేక్ చేయనున్నారు.

మరి ఈ చిత్రాన్ని హిందిలో సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని చేయనున్నాడు. అయితే హిందీలో రీమేక్ అంటే ఏవేవో ప్లానింగ్ లు చేస్తారని తెలిసిందే. అలాగే ఈ సినిమాకి కూడా కొన్ని షాకింగ్ ప్లాన్ లు చేస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

ఒరిజినల్ లో లోకేష్ కనగరాజ్ ఒక్క హీరోయిన్ కూడా లేకుండా సినిమాని చేసాడు. అలాగే రీమేక్ లో అయితే ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ ని మేకర్స్ పెడుతున్నారట. దీనితో ఒరిజినల్ ని కంపు చేసి పారేసేలా ఉన్నారని కోలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం పడుతున్నారు.

ఖైదీ సినిమాకి మంచి పేరు ఉంది. దీన్ని అనవసర మార్పులు తో పాడు చేస్తున్నారని చెప్పాలి. లాస్ట్ టైం రాక్షసుడు సినిమాలో కూడా ఇలానే షాకింగ్ మార్పులు హీరోయిన్ తో ఎక్స్ పోజింగులు కూడా చేయించేసారు. మరి ఈ ఖైదీ రీమేక్ లో ఎలాంటి అద్భుతాలు సెట్ చేస్తారో చూడాలి.