ఆ యాంక‌ర‌మ్మ‌ని బ్యాన్ చేయాలి!

లాక్ డౌన్ తో తెలుగు రాష్ర్టాల పేద ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో? క‌ళ్లారా చూస్తున్నాం. వ‌ల‌స‌ కూలీలు…రోజువారి కూలీలు..నిరూపేద‌లు..పుట్ పాత్ మీద జీవ‌నం సాగించే వారు..పేద‌..మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారంతా లాక్ డౌన్ తో ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప‌నికి పోలేక‌..పొట్ట నింపుకోలేక న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. ఆక‌లి కేక‌లు క‌న్నా..ప్రాణం మిన్న కాబ‌ట్టి అన్నింటిన భ‌రిస్తూ ఒక పూట తిని మ‌రో పూట ప‌స్తుతో కాలం గడుపుతున్నారు. ప్ర‌భుత్వం కేటాయించిన నిధులు.. టాలీవుడ్ ఇండ‌స్ర్టీ నుంచి కొంత మంది ప్ర‌ముఖులు ఇచ్చిన విరాళాలతో బ్ర‌త‌కు బండి ముందుకెళ్తోంది.

అయితే టాలీవుడ్ నుంచి స్పందిచాల్సిన దాత‌లు ఇంకా చాలా మందే ఉన్నార‌ని..కానీ వాళ్లెవ్వ‌రు రూపాయి కూడా విరాళంగా ఇవ్వ‌డం లేద‌ని ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌వ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. స్టార్ హీరోయిన్లు…తెలుగు యాంక‌ర్లు స్పందిచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వాళ్ల‌ను అభిమానించే వాళ్లే అంటున్నారు. ముఖ్యంగా బుల్లి తెర యాకంర్ గా బాగా ఫేమ‌స్ అయిన సుమ క‌న‌కాల‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వెల్లు వెత్తుతున్నాయి. అన్నీ టీవీ షోల‌ను చుట్టేసే ఈ యాంక‌ర‌మ్మ కొవిడ్-19 బాధితుల‌కు ఒక్క రూపాయి అయినా విరాళంగా ఇచ్చిందా? బాధితుల ఆక‌లి కేక‌లు ఈ అమ్మ‌డికి ప‌ట్ట‌వా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అన్నీ టీవీ ఛానెల్స్ లో షోలు చేస్తూ కోట్ల రూపాయాలు గ‌డించింది. ఏనాడైనా ఎవ‌రికైనా సాయం చేసిందా? అంటూ మండిప‌డుతున్నారు. ప్రేక్ష‌కులు మీలాంటి వాళ్ల‌ను టీవీల్లో చూడ‌టం వ‌ల్లే అంత పాపుల‌ర్ అయ్యారు. కోట్ల రూపాయ‌లు గ‌డించారు అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకండి అంటూ ముఖ్యంగా ఉత్త‌రాంద్ర వాసులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ఏర్పాటు చేస్తే మాన‌వ‌తా దృక్ప‌థం ఉన్న వాళ్లంతా స్పందించి త‌మ‌కు తోచిన స‌హాయం చేసారు. కానీ సుమ మాత్రం చ‌డిచ‌ప్పుడు లేకుండా ఉందని నిప్పులు చెరుగుతున్నారు. ఈవిడ గారు మ‌ళ్లీ విరాళాలు ఎలా సేక‌రించాలి అని ఉచితంగా స‌ల‌హాలు ఇవ్వండి ఒక‌టి అంటూ మంటెక్కిపోతున్నారు. ఇలాంటి వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌కుండా బ్యాన్ చేయాలంటూ ప‌రిశ్ర‌మ ఇన్ సైడ్ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ‌కు రావ‌డం విశేషం. సేవ అనేది ఒక‌రు చెబితే చేసేది కాదు. అది ఒక‌రితో చెప్పించుకోకుండా వ్య‌క్తిగ‌తంగా చేసేది. మ‌రి ఆ మార్పు ఇప్ప‌టికైనా యాంక‌ర్మ‌లో వ‌స్తుందో? లేదో.