Suma: మూగబోయిన సుమ…. మాట్లాడితే ఆ సమస్య తప్పదా…. షాక్ లో అభిమానులు!

Suma: యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ తన మాటతీరుతో అల్లరి చేష్టలతో అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. ఒకప్పుడు బుల్లితెరపై ఏ ఛానల్ పెట్టిన అందులో సుమ కార్యక్రమాలు తప్పనిసరిగా వచ్చేవి అయితే ఇటీవల కాలంలో సుమా కాస్త బుల్లితెర కార్యక్రమాలకు విరామం ఇచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం సుమ వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒక సినిమా పూజ కార్యక్రమాల నుంచి మొదలుకొని ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ వరకు ఆ సినిమా బాధ్యతలను తీసుకొని యాంకరింగ్ చేస్తూ ఉంటారు ఇలా సినిమా ఈ వెంట్లకు అలాగే సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు అంటూ ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు.

ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఎప్పుడు గలగల మాట్లాడే సుమా గొంతు మూగబోయిందని తెలుస్తోంది. దాదాపు పది రోజులపాటు ఈమె మాట కూడా మాట్లాడకూడదని మౌనవ్రతం పాటించాల్సిందే అంటూ డాక్టర్లు హెచ్చరించారని తెలిసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇక ఇదే విషయాన్ని సుమ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. గతంలో తాను పలు సమస్యలతో బాధపడ్డాను అంటూ ఈమె గతం గురించి చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నాకు వోకల్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ నా వాయిస్ కి రెస్ట్ ఇవ్వమని చెప్పారు. దాంతో పది రోజులు నా గొంతు మూగబోయింది. మౌనవ్రతం చేశాను. నా వోకల్ కార్డ్స్ లో స్మాల్ బంప్స్ రావడం వల్ల అసలు మాట్లాడకూడదని తెలిపారు.

నిరంతరం గ్యాప్ లేకుండా ఎక్కువగా మాట్లాడుతూ అర్చడం వల్ల ఇలా వోకల్ కార్డ్స్ లోని నరాలు దెబ్బతిన్నాయని ఈ నరాలు మనకు మాట్లాడటానికి సహాయం చేస్తాయి కనుక పది రోజులపాటు మాట్లాడకుండా ఉంటేనే పూర్తిగా నయం అవుతుందని డాక్టర్లు చెప్పినట్లు సుమ తెలిపారు. ఇలా పది రోజులపాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా గొంతు మూగబోయిందని అయితే ట్రీట్మెంట్ తీసుకోవడంతో తగ్గిపోయిందని సుమా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.