శర్వానంద్ ‘రణరంగం’ టీజర్@జూన్ 29

దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘రణరంగం’. ఈ సినిమాలో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమా నేపధ్యం పాతదే అయినా తెర పై కొత్తగా చూపించే ప్రయత్నం చేశామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ అంటూ తెల్ల గడ్డంతో ఉన్న శర్వానంద్ ను చూపించారు.
ఇక ఈ చిత్రం టీజర్ ఈ రోజు సాయంత్రం 4 .05 ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సీరియస్ గ్యాంగ్స్టర్ కథేమిటో చూడాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది