శంకర్ చేతిలో తమిళ సూపర్ స్టార్ల పిల్లల భవిష్యత్తు

తమిళ దర్శకుడు శంకర్ అంటే దేశ వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో నటించాలని దాదాపు ప్రతీ హీరో, హీరోయిన్ కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. అలాగే మన తమిళ స్టార్ హీరోలు వాళ్ళ పిల్లలు శంకర్ దర్శకత్వంలో చేయాలనీ కెరీర్ ప్రారంభంలోనే జరగాలని అనుకుంటున్నారు.
వాళ్ళే చియాన్ విక్రమ్ మరియు ఇళయదళపతి విజయ్. వాళ్ళ పిల్లలు జేసన్ విజయ్ మరియు ధృవ్ విక్రమ్ లు. వీళ్లిద్దరి కలయికలో శంకర్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 2020 లో మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం విక్రమ్ కొడుకు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ చేసి విడుదల కోసం ఎదురు చూస్తుండగా విజయ్ కొడుకు ఇంకా ఏ సినిమాకి సంతకం చేయలేదు.