కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తోంది. దీని వల్ల అంతా ఇంటి పట్టునే వుంటున్నారు. చాలా మంది ఈ పీరియడ్‌ని వారికి నచ్చిన వీడియోలు రూపొందించడానికి వియోగించుకుంటుంటే డైరెక్టర్స్ మాత్రం కొత్త స్క్రిప్ట్‌లని సిద్ధం చేసుకోవడానికి వినియోగించుకుంటున్నారు. ఇంత ఒత్తిడి గల సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఈ విషయంలో కొరటాల శివ ముందు వరుసలో నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో`ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన అనూహ్యంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్ని అధిగమించి కొత్త కథని సిద్ధం చేస్తున్నారాయన. ఓ పక్క 40 శాతం పూర్తయిన `ఆచార్య` ఎప్పుడు పూర్తవుతుందా? .. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో కొరటాల కొత్త స్క్రిప్ట్‌ని పూర్తి చేయడం నిర్మాతలకు, సమకాలీన దర్శకులకు షాకింగ్‌గా వుందట.
ఈ కథకు ఎవరు సరిపోతే వారితోనే చేయాలని కొరటాల భావిస్తున్నారట. స్టార్ హీరోనే కావాలనే కండీషన్స్ లేకుండా ఈ కథని సిద్ధం చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే గతంలో తన తదుపరి చిత్రాన్ని యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తానని చెప్పిన కొరటాల కరోనా వల్ల సరిస్థితులు మారడంతో కొత్త కథని మాత్రం ఏ హీరో కుదిరితే ఆ హీరోతో చేయాలనుకుంటున్నాడట.