Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ గతేడాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి పార్ట్ ఆశించిన స్థాయిలో నార్త్ ఇండియాలో సక్సెస్ అవకపోయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇదే స్ఫూర్తితో కొరటాల శివ రెండో పార్ట్ పై మరింత ఫోకస్ పెట్టి, కథను పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. మొదటి పార్ట్ లో ప్రధానంగా పాయింట్ ను మాత్రమే చూపించగా, అసలు కథ రెండో భాగంలో ఉంటుందని సమాచారం.
‘దేవర 2’లో ఎన్టీఆర్ పాత్ర మరింత పవర్‌ఫుల్ గా ఉంటుందంటున్నారు. ఫస్ట్ పార్ట్ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని, సెకండ్ పార్ట్ కథనాన్ని నార్త్ ఇండియా ఆడియన్స్ పై మరింత ప్రభావం చూపేలా మార్పులు చేస్తున్నారు. ఈ సినిమా కథలో యాక్షన్ ఎలిమెంట్స్, బ్లడ్ షెడ్స్ తో మరింత థ్రిల్లింగ్ ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ జరగుతుండగా, షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తన తదుపరి ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు. దీని తర్వాత కొరటాల శివతో ‘దేవర 2’ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ‘దేవర 2’లో జాన్వీ కపూర్ పాత్రకు ముఖ్యమైన స్కోప్ ఉండటమే కాకుండా, నాటకీయ ట్విస్ట్ లు ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. మొదటి భాగం కంటే రెండో భాగంపై జాన్వీ మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.