మొబైల్ బ్రాండింగ్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్

సినిమా తారలు నెలల తరబడి సినిమాకోసం షూట్ చేస్తే వచ్చే డబ్బు ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉంటే చాలు ఒకటి రెండు రోజులు షూటింగులో సంపాదించుకోవచ్చు. పెద్ద పెద్ద బ్రాండ్లకు రెండు కోట్ల నుండి పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఉంటుంది. సినిమా తారలే కాదు స్పోర్ట్స్ స్టార్స్ ని కూడా వివిధ బ్రాండ్స్ ప్రచారానికి వాడుకుంటున్నారు కంపెనీ యాజమాన్యులు. ఎందుకంటే వారి అభిమానులు ఆ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారి నమ్మకం.

తాజాగా మన జూనియర్ ఎన్టీఆర్ ఒక మొబైల్ స్టోర్ కు బ్రాండ అంబాసిడర్ గా ఉండటానికి అగ్రిమెంట్ సైన్ చేసాడని సమాచారం. సెలెక్ట్ మొబైల్స్ అనే చైన్ స్టోర్ కి ఏడాదిపాటు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. కొన్ని రోజుల కిందటే హీరోయిన్ అద్వానీ పలు చోట్ల సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ ఓపెన్ చేసింది.