మా సినిమా ఫలానా హీరో సినిమా రికార్డుల్ని అధిగమించేసింది అంటే లేదు లేదు మా సినిమానే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. నాన్ బాహుబలి కలెక్షన్లని దాటేసింది మా సినిమానే అంటే మా సినిమానే.. ఇదీ పెద్ద చిత్రాల నిర్మాతల తీరు. ఇకపై ఇలాంటి కాకి లెక్కలు కలెక్షన్ల లెక్కలు చెల్లవు. ఫేక్ కలెక్షన్లపై కొరడా ఝుళిపిస్తారట. ఫేక్ కలెక్షన్ల కారణంగా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అనే పదాలకి అర్థం లేకుండా పోతోంది.
ఈ విషయంపై ఇక నుంచి నిర్మాతలు స్ట్రిక్ట్‌గా వుండాలని, ఇక మీదట ఫేక్ కలెక్షన్ లు వెల్లడించొద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇకపై పెద్ద సినిమాల వసూళ్ల వివరాల్ని ఏరియాల వారీగా నిర్మాతల మండలి సభ్యులే స్వయంగా పరిశీలించి బాక్సాఫీస్ లెక్కల్ని వెల్లడించనున్నారట. ఇది అయ్యే పనేనా? అని కొంత మంది నిర్మాతలు బాహాటంగానే చెబుతున్నారట. నిజమే అలా కలెక్షన్లు మేమే వెల్లడిస్తామంటే ఏ నిర్మాత ఊరుకుంటాడు. నా సినిమా.. నా కలెక్షన్స్ మధ్యలో మీ బోడి పెత్తనం ఏంటని ఎదరు ప్రశ్నంచరూ .. అంటూ అప్పుడే నిర్మాతల్లో చర్చమొదలైందట.