గరుడ వేగ 2 తో రానున్న రాజశేఖర్

యాంగ్రీ యంగ్ మాన్ అఫ్ టాలీవుడ్ అంటే రాజశేఖరే. దానికి తగ్గట్టు ఆయన చేసిన సినిమాలు, అందులోని పాత్రలు ఉన్నాయి. అయితే కొత్త నీరు వచ్చి చేరిన ఈ సమయంలో ఆయన మరుగున పడిపోయారు అనుకున్న తరుణంలో మళ్ళీ ‘గరుడ వేగ’ తో విజయం అందుకుని కుర్ర హీరోలకు తానేమీ తక్కువ కాదని నిరూపించారు. ప్రస్తుతం ఆయన ‘కల్కి’ అంటూ మరో రెండు రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు.

ఈ తరుణంలో ఆయన ‘గరుడ వేగ’ కి సీక్వెల్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సీక్వెల్ ను కూడా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.