ఆద‌ర్శంగా నిలుస్తున్న స్టార్ హీరో!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండవం చేస్తున్న విష‌యం తెలిసిందే. చైనాలోని పుహాన్ న‌గ‌రంలో పుట్టిన క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్‌ని పాటిస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో లాక్‌డౌన్ ని ఈ నెల 31 వ‌ర‌కు పొడిగిస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో థియేట‌ర్లు, మాల్స్‌, సినిమా షూటింగ్‌లు నివ‌ధికంగా బంద్ య‌దావిధిగా కొన‌సాగ‌బోతోంది.

దీంతో కింది స్థాయి వ‌ర్గం ఈవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ముఖ్యంగా సినిమా షూటింగ్‌ల వల్ల ఉపాధి పొందే సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నారు. వీరంద‌రినీ ఆదుకోవ‌డానికి హీరో డా. రాజ‌శేఖ‌ర్ దంప‌తులు ముందుకొచ్చారు. నిరుపేద సినీ కళాకారుల‌కు, కార్మికుల‌కు ప‌దిరోజుల పాటు నిత్యావ‌స‌ర వ‌స్తువులు అందించ‌డానికి సిద్ధ‌మై ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త్వ‌ర‌లోనే సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ని అందించేందుకు డా. రాజ‌శేఖ‌ర్ దంప‌తులు ఏర్పాట్లు చేస్తున్నాయి.