Salaar Movie Review – సాలార్ మూవీ రివ్యూ

Salaar Movie Review

సాలార్ మూవీ రివ్యూ – ఒక మనిషి తనకి నచ్చిన విషయం కోసం ఎంత దూరమైనా రాగలడు. అదే మనిషి తనకి నచ్చని విషయం అంతు చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. అందులోనూ స్నేహం పంచ ప్రాణాలుగా బతికే మనిషైతే ,స్నేహం కోసం ప్రాణం ఇవ్వటానికైనా, తీయటానికైనా సిద్ధపడతాడు. నచ్చిన వరదా రాజా మన్నార్ స్నేహం కోసం దేవరధ చేసిన మారణ హోమం సలార్ .. సలార్ చిత్రం ఇవాళే వచ్చింది ఎలా ఉందొ చూసేద్దామా.

కధ : 
రాజమన్నార్ (జగపతిబాబు) తన సామ్రాజ్యం ఖాంసార్ నుండి బయటకి వెళ్తాడు. అక్కడున్న తన అనుచరులకు తాను వరదా(ప్రిద్విరాజ్) ని తన వారసుడిగా చేస్తాను అని చెప్తాడు .. అది నచ్చని కొన్ని శక్తులు వరదాని అడ్డు తొలిగించుకునేందుకు చూస్తుంటాయి.శృతిహాసన్ ఇండియా వస్తుంది .. దేవా(ప్రభాస్) తనకి ఆశ్రయం ఇస్తాడు. ఓబుళమ్మ ఆమెని చంపాలని చూస్తోంది. ఓబుళమ్మ యజమాని శ్రీయారెడ్డి శృతిహాసన్ ని అడ్డుపెట్టుకుని దేవరధ ని Seal ఉన్న van ని ఆపేలా చేస్తుంది. అసలు seal ఎందుకు వేశారు , ఎవరు వేశారు , ఎవరు ఆపారు , ఎందుకు ఆపారు , ఆపితే ఆపిన వారిని ఏం చేస్తారు ? ప్రిద్విరాజ్ (వరదా ) కి దేవా (ప్రభాస్) కి స్నేహం ఎలా వారి జీవితాలని మార్చేసింది ఎందుకని ప్రభాస్ ప్రిథ్విరాజుకి శత్రువైయ్యాడు ? అసలు సలార్ దేవరధ రైసార్ ఎవరు ? చూడాలంటే సలార్ చూడాల్సిందే !!

Read More: “సలార్” మీద ఇక డౌట్స్ అక్కరలేదా??

ప్రాణం పోసినవి : Salaar Movie Review
ప్రభాస్ నటన అద్భుతం.. మొదటి ప్రాణం. ప్రభాస్ ఆరడుగుల cutout చూస్తుంటే చాలు అన్నట్టు ఉంది , ఫాన్స్ కి పూనకాలు వచ్చినా తక్కువే అన్నట్టు ఉంది ప్రభాస్ క్యారెక్టర్. రాధే శ్యామ్ తరవాత ప్రభాస్ ఫాన్స్ ఆకలితో ఉన్నారు వారికీ ప్రశాంత్ నీల్ ఒక మంచి విందు భోజనం ఇచ్చాడు. ఎక్కడా ఒక్క నిమిషం కూడా ప్రభాస్ మనల్ని కన్ను తిప్పుకునేలా చేయలేదు చిత్రంలో.

ప్రిద్విరాజ్ వరదాగా మంచి నటనతో ఆకట్టుకుంటాడు , అసలు తెలుగు dubbing తానే చెప్పుకున్నట్టు ఉన్నాడు , చాల బాగుంది తన నటన. ముక్యంగా ప్రభాస్ తో తన స్నేహం చిత్రానికి హైలైట్. ప్రిద్విరాజ్ రెండో ప్రాణం.

ప్రశాంత్ నీల్ , ఏదో ఉంది ఇతని రచనలో , screenplay మాయ చేస్తాడు. ఎక్కడ ప్రారంభించాడో తెలిసే లోగా , ఎందుకు అక్కడ ప్రారంభించాడో చెప్తూ,ఇంతకన్నా ఈ సీన్ ఇంత మంచిగా చూపించలేం అన్నట్టు తీస్తాడు. అందులోను ముఖ్యంగా డ్రామా సన్నివేశాలు చాల బాగుంటాయి , KGF కి ఏమాత్రం తక్కువ కాకుండా హీరో elevation సీన్స్ చాల బాగున్నాయి సలార్లో.

ఖచ్చితంగా చూడాల్సిన సన్నివేశం ఈ చిత్రం లో … కోటేరమ్మ కి బలి ప్రభాస్ ఇచ్చే సన్నివేశం , సన్నివేశం చివర్లో ” నువ్వు నిజామా కాదా అని తాకి చూస్తున్న” అని చెప్తుంటే , ఆ చుట్టూ ఉన్నవారి కష్టం ఎంత దుర్భరమో దానిని దూరం చేసినా కూడా నమ్మలేని వారి అమాయకత్వం ఎంత వేదనో తెలిసేలా చేసాడు ప్రశాంత్ నీల్ .. ఇతను చిత్రానికి మూడో ప్రాణం

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రవి బాస్రుర్ ఒక అద్భుతం. KGF తీరులోనే రవికి మంచి అవకాశం ప్రభాస్ సలార్ , తాను కచ్చితంగా చిత్రానికి నాలుగో ప్రాణం ..

Stunts , ఒక్కొక ఫైట్ ఈ చిత్రంలో ఒక్కొక్క కథ చెప్తూ వస్తాయి .. అంబరీవ్ అందించిన ఫైట్స్ మనకి చిత్రంలో చాల వైవిధ్యంగా ఉంటాయి .. మూస కొట్టుడే అయినా చాల రోజుల తరవాత ఒక చిత్రంలో fights బాగున్నాయి అనిపించేలా ఉన్నాయి ఈ చిత్రంలో .. ఇవి ఐదో ప్రాణం. ఈశ్వరి రావు , జగపతి బాబు , శ్రీయ రెడ్డి , anchor ఝాన్సీ , ఇతరులు ఎవరి పాత్రకి తగ్గట్టు వారి పరిధిలో బాగా నటించారు

Read More: ఫైనల్ గా “సలార్” కి సలాం కొట్టించారు.. 

కాస్త ఇబ్బంది పెట్టింది :
శృతి హాసన్ క్యారెక్టర్ , పూర్తిగా క్లారిటీ రాకపోవటం వల్ల ఏమో , సలార్ మొదటి అధ్యాయం లో కాస్త bore కొడుతుంది .. ద్వితీయ భాగం లో శృతికి ఏమైనా పాత్ర పరిధి పెరుతుందేమో , చూడాలి. పూర్తిగా కథ చెప్పలేదు మొదటి భాగమే అవటం వల్ల , ప్రస్తుతం చాల ప్రశ్నలు మిగిలి ఉన్నాయి , బాహుబలి రెండో భాగం కోసం వేచి చూసినట్టు సలార్ రెండో భాగం కోసం వేచి చూడాల్సిందే ..

మొత్తంగా :
ప్రభాస్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్, తెలుగు ప్రేక్షకుడికి ప్రశాంత్ నీల్ అందించిన మాస్ కా బాప్ అనిపించే చిత్రం సలార్. కాకపోతే ఇది ప్రశాంత్ నీల్ ముందు చిత్రాల మాదిరే ఉండటం కొంచెం బాధ కలిగించచ్చు, ముఖ్యంగా ఉగ్రం చూసిన వారికి. అయినా కూడా ప్రభాస్ తో చేస్తుండటం వల్ల కొత్తగా మరో శక్తిగా ఉంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రశాంత్ నీల్ screenplay మేజిక్ workout అయిందనే చెప్పాలి. మరో సారి ప్రభాస్ ప్రభంజనం చూసినా ఆశ్చర్యం లేదు అనచ్చు.

Salaar movie Review –  3.5/5

/పవన్ దావులురి