“సలార్” మీద ఇక డౌట్స్ అక్కరలేదా??

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ చిత్రాలు రెండే ఉన్నాయని చెప్పాలి. ఈ డిసెంబర్ లో వస్తున్నా ఆ చిత్రాలే ఒకటి “ఆనిమల్” కాగా మరో చిత్రమే “సలార్” పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా అలాగే ఆనిమల్ ఈ రెండు సినిమాలతోనే ఈ ఏడు డిసెంబర్ నెల మొదలు కానుంది. డిసెంబర్ 1 నే సలార్ ట్రైలర్ విడుదల కాబోతుండగా అదే రోజున ఆనిమల్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే సలార్ ట్రైలర్ విషయంలో ఒకింత టెన్షన్ కూడా ఫ్యాన్స్ లో లేకపోలేదు.

ఇన్ని రోజులు హైప్ ఇచ్చి మళ్ళీ చివరి నిమిషంలో హ్యాండివ్వడం లాంటివి చేస్తారా అనుకుంటున్నా సమయంలో ఈరోజు అప్డేట్ కూడా చిత్ర యూనిట్ ఇచ్చేసారు. ఇంకా జస్ట్ మూడు రోజుల్లోనే “సలార్” ట్రైలర్ వస్తున్నట్టుగా అదే టైం తో ప్రకటించి ఫ్యాన్స్ ని అలెర్ట్ చేస్తున్నారు.

దీనితో ఈ ట్రైలర్ కానీ సినిమా గాని ఆగేది లేదు అని మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. సో ఇక ఈ సినిమా విషయంలో ఆడియెన్స్ కి ఎలాంటి డౌట్స్ కూడా అంతగా అక్కరలేదని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఓ నెవర్ బిఫోర్ ఇండియన్ రిలీజ్ గా సలార్ రిలీజ్ కాబోతుంది.