ఆసియా కప్-2025 ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన తీరును ముఖ్యమంత్రి ప్రశంసించారు. యువతకు తిలక్ వర్మ పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అనంతరం, తిలక్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపకార్థంగా ఒక క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు.
ఈ సమావేశంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ కీలకమైంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు యువ క్రికెటర్ రాణించడంపై రాష్ట్రంలో హర్షం వ్యక్తమవుతోంది.

