తెలంగాణ రాజకీయాల్లో…. భర్తల కంటే భార్యలే సూపర్ రిచ్

సాధారణంగా మగవాడి సంపాదన , ఆడవాళ్ల వయసు అడగొద్దంటారు. ఆరోజులు పోయాయి. ఇపుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడం, ఆ పైన ఎన్నికల కమిషన్లు ఆస్తిపాస్తుల మీద అఫిడవిట్ ఫైల్ చేయాలని నియమం పెట్టడంతో మగోళ్ళ సంపాదన, ఆడవాళ్ల వయసు అన్నీ తెలిసిపోతున్నాయి.  తమాషా ఏమిటంటే, ఇపుడు ఆడవాళ్ల సంపాదన ఎక్కువగా ఉన్నట్లుంది. సంపాదించే రాజకీయనాయకులకంటే, గృహిణులుగా ఉంటున్న రాజకీయ నాయకుల భార్యలకే ఎక్కువ అస్తులున్నాయి. 

భర్తలు రాజకీయాల్లోకి రానంతవరకు వీళ్లంతా అక్షరాల గృహిణులే.  భర్త రాజకీయాల్లో విజయవంతమవుతూనే భార్యల సంపాదన పెరిగిపోతున్నది. కొొందరి భార్యలు కంపెనీల డైరెక్టర్లు, ఛెయిర్ పర్సన్ లయి సంపాయిస్తుంటే, కొందరే ఇంటి దగ్గిరే ఉండి కాలు కదపకుండానే కోట్ల ఆస్తి కూడ బెట్టుకుంటున్నారు. ఈ రహస్యం కూడా ఎన్నికల కమిషన్ అఫిడవిట్ లో వెల్లడించాలని చెబితే, సాధారణ మగోళ్ల భార్యలు కూడా  ఫాలో అయి నాలుగు రూకలు సంపాదించకుంటారు.   

తెలంగాణ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేస్తూ సమర్పించిన ఆస్తిపాస్తుల అఫిడవిట్ చూస్తే నేతల భార్యలు బాగా సంపాదిస్తున్నారని అర్థమవుతుంది.

ఉదాహరణకు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి గా చెప్పుతున్న ఐటి మంత్రి కెటి  రామారావు  సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయన కంటే, ఆయన భార్యశైలిమ సూపర్ రిచ్. మన ఐటి మంత్రికేమో రు 4.93 కోట్ల అస్తులుంటే శైలిమాకు రు.36.05 కోట్ల ఆస్తులన్నాయి.

అలాగే కాంగ్రెస్ నుంచి చీఫ్ మినిస్టర్ రేస్ లోఉన్న సీనియర్ నాయకుడు కె జానారెడ్డి కంటే, ఆయన భార్య సూపర్ రిచ్. రెడ్డి గారి ఆస్తి కేవలం రు 3.32 కోట్లయితే, ఆయన భార్య సుమతి ఆస్తుల విలువ రు. 13. 66 కోట్లు.

 

టిఆర్ ఎస్ మంత్రి జి జగదీష్ రెడ్డి ఆస్తి విలువ కేవలం రు. 1.25 కోట్లయితే, ఆయన భార్య జి సునీత అస్తి రెండింతలెక్కువ, అంటే రు. 2.27 కోట్లు.

 

ఆర్థిక మంత్రి ఈటెలరాజేందర్ ఆస్తి కేవలం రు. 12.82 కోట్లు. ఈటెల భార్య జమున రు.29.58 కోట్ల విలువయిన ఆస్తితో యమరిచ్. పిసిసి ప్రశిడెంట్  ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య విషయంలోనే కొంత తేడా ఉంది.

ఉత్తమ్ కేంద్రంలో మాంచి ఉద్యోగం చేశాడు, రాష్ట్రంలో మంత్రి గా పని చేశాడు, అయితే ఆయన ఆస్తి మాత్రం రు. 2.08 కోట్లు మాత్రమే. ఆయన భార్య పద్మావతి కూాడా మొన్నటి దాా ఎమ్మెల్యే. అయినా ఆమె ఆస్తుల విలువ ఏం పెరగలేదు. అది కేవలం రు.98.20 లక్షలు మాత్రమే.

ఈ పరిస్థితి ఆంధ్రలో కూడా ఉంది. నిన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కుటుంబ  సభ్యుల అస్తిపాస్తుల వివరాలను కొడుకు,ఐటి మంత్రి నాారాలోకేష్ విడుదల చేశారు. ఈ లెక్కల ప్రకారం, దేశంలోనే సీనియర్ మోస్టు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకంటే, ఆయన భార్య భువనేశ్వరి సూపర్ రిచ్. చంద్రబాబు ఆస్తులు కేవలం రు. 2.99 కోట్లే. భువనేశ్వరి ఆస్తి ఇంతకంటే చాలా చాలా చాలా ఎక్కువ. ఆమె ఆస్తుల విలువ రు.53.37 కోట్లు. ఇదీ సంగతి.