స్వామిగౌడ్ కు రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కేనా?

తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛెయిర్మన్ స్వామిగౌడ్ కు కౌన్సిల్ కు తిరిగి వస్తారా? ఈ చర్చ మొదలయింది రాజకీయ వర్గాల్లో. ఆయన ఈ మార్చిలో రిటైరవుతున్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి మీద బాగా వత్తిడి ఉండటంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి బాగా ఉపయోగ పడే వారికి కౌన్సిల్ సీటు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల నియోజకవర్గాలలో బాగా పట్టు ఉన్న వాళ్లకి ఈ అవకాశం కల్పించవచ్చని అనుకుంటున్నారు. కరీంనగర్ గ్యాజుయేట్ నియోజకవర్గం నుంచి ఆయన అత్యధిక మెజారీటీతో ఆయన కౌన్సిల్ కు గెలుపొందారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ప్రముఖుల టిఆర్ ఎస్ లో చేరారు. వారంతా మొన్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. వారిలో కొందకి కౌన్సిల్ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసియార్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ వత్తిడిలో స్వామిగౌడ్ కు కౌన్సిల్ సీటు అనుమానం అని కొందరంటున్నారు. అయితే, ఖాళీలు ఎక్కువగా నే ఉన్నందున ఒక్క సీటు ఆయన ఇస్తే నష్టం లేదని మరికొందరి వాదన. మొత్తానికి స్వామిగౌడ్ కు కౌన్సిల్ సీటు దక్కుతుందా లేదా అనే చర్చ మొదలయింది. ఏప్రిల్ లో మొత్తం 13 ఖాళీలుంటాయి.  కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లు, టిఆర్ ఎస్ లో తొలి నుంచి వచ్చిన వాళ్లా దాదాపు 25 మంది దాకా ఎ మ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.

నలభై మంది సభ్యులున్న కౌన్సిల్ లో నలుగురు సభ్యులు రాజీనామా చేయడంతో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి నరేందర్ రెడ్డి, మైనంపల్లి భాస్కర్ రావు, కొండా మురళి ఈ మధ్య రాజీనామా చేశారు. వీరిలో కొండామురళి కాంగ్రెస్ పార్టీలో చేరినందున కౌన్సిల్ కు రాజీనామా చేశారు. మిగతావారు అసెంబ్లీకి గెలుపొందడంతో కౌన్సిల్ కు రాజీనామా చేశారు.

వీళ్లు కాకుండా మరొక 9 మంది పదవీ కాలం పూర్తవుతున్నది. వారిలో కౌన్సిల్ ఛెయిర్మన్ స్వామిగౌడ్ ,కాంగ్రెస్ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. ఈ ఖాళీలలో 12 స్థానాలు టిఆర్ ఎస్ దక్కుతుంది. ఇందులో ఒక సీటు హోం మంత్రి మహమూద్ అలీకి కేటాయించక తప్పదు. రీనామినేషన్ గ్యారంటీ ఆయన ఒక్కరికే లభించింది. కాంగ్రెస్ కు మిగిలేది ఒక్కటే. ఈ ఒక్క స్థానానికి ఎవరినీ నామినేట్ చేస్తారనే కాంగ్రెస్ లో చర్చ నడుస్తూ ఉంది.