బీజేపీ నేతలను బెదిరిస్తున్న కేసీఆర్, కేటీఆర్.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈరోజు ఉపఎన్నిక జరుగుతుండటంతో తెలంగాణలో వాతావరణం కూడా చల్లబడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా రాబోయే 18 నెలల్లో చేసే అభివృద్ధి పెద్దగా ఉండదు. ఉపఎన్నికలో గెలిచిన అభ్యర్థి 2024 మెయిన్ ఎలక్షన్స్ లో విజయం సాధిస్తారో లేదో కచ్చితంగా చెప్పలేమనే సంగతి తెలిసిందే.

అయితే కేసీఆర్, కేటీఆర్ మాత్రం బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీపై పదేపదే విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ పెద్దలు తెరాసను టార్గెట్ చేసే అవకాశం కలుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ పెద్దలు తెరాసను టార్గెట్ చేయడం మొదలుపెడీతే తెరాసకు ఇబ్బందులు తప్పవని మరి కొందరు చెబుతున్నారు. మరోవైపు జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ చేసిన హడావిడి మూన్నాళ్ల ముచ్చట అయింది.

కేసీఆర్ చెబుతున్న జాతీయ పార్టీని సొంత పార్టీ నేతలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది. కేసీఆర్, కేటీఆర్ బీజేపీ నేతలను బెదిరించినా వాళ్ల ప్లాన్స్ వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోదీ, అమిత్ షాలను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే తెరాసకు నష్టమని చెప్పవచ్చు.

2024 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చినా ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పదేపదే బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ప్రజల్లో కూడా తెరాసపై నెగిటివ్ ఒపీనియన్ కలుగుతోంది.