తెరాస పార్టీలో చాలా ఏళ్లుగా కేసీఆర్, హరీష్ రావుల మధ్యన అంతర్గత విబేధాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. హరీష్ రావును తొక్కేసి కేసీఆర్ తన కుమారుడిని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు ఛాన్నాళ్ల నుండి ప్రచారం జరుగుతోంది. అందుకు బలాన్నిచ్చే సంఘటనలు అనేకం జరిగాయి కూడ. అయితే పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హరీష్ రావు మౌనంగా ఉండిపోతున్నారనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. కొన్నేళ్ల కృత్యం హరీష్ రావు తన అనుచర గానని తీసుకుని తెరాస నుండి బయటికి వచ్చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
అదే జరిగితే తెరాసలో భారీ చీలికలు రావడం, ఆ పార్టీ అధికారం కోల్పోవడం చకచకా జరిగిపోతాయి. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ కోరుకునేది కూడ అదే. కానీ వాళ్ళ ఆశ నెరవేరట్లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి హరీష్ రావులో కేసీఆర్ పట్ల వ్యతిరేకతను పెంచి పోచించే ప్రయత్నాలు చేస్తుంటారు ప్రత్యర్థి పార్టీ నాయకులు. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సరిగ్గా ఈ పనే చేశారు. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు ముగిశాక కేసీఆర్ హరీష్ రావుకు పెద్ద బహుమతి ఇస్తారని అనిపిస్తోందని, అందేమిటంటే తాను సీఎం పదవికి రాజీనామా చేసి అందులో కుమారుడు కేటీఆర్ ను కూర్చోబెడతారనే అనుమానం కలుగుతోందని అన్నారు.
హరీష్ రావు దుబ్బాకలో బీజేపీ మీద విరుచుకుపడి ప్రచారం చేస్తున్నారు, ఆయనకు ధీటుగా కేసీఆర్ తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించి బీజేపీ మీ సవాళ్లు విసురుతున్నారని ఇదంతా ఆయన్ను డామినేట్ చేయడానికేనని, ఈ హెచ్చరికలు కేవలం బీజేపీ మాత్రమే కాదని హరీష్ రావుకి కూడ అని రాములమ్మ పేర్కొన్నారు. మొత్తం మీద కేసీఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని… ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కేసీఆర్ గారు అనుసరించే స్టైలే వేరు అంటూ పెద్ద స్టేట్మెంట్ వదిలారు. దీన్నిబట్టి మరోసారి మామ అల్లుళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.