టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ వి.హన్మంతరావు. శనివారం ఆయన అధ్యక్షతన వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు.
కేసిఆర్ నయీం పైసలు మొత్తం తినేసిండని ఆరోపించారు. నయీం డబ్బు లెక్క పెట్టేందుకు బెంగుళూరు నుంచి మిషిన్లు తెప్పించారని అన్నారు. ఆ మిషిన్లు టిప్కు టిప్కు అని లెక్క పెట్టిన సొమ్ము ఎటుపోయిందని ప్రశ్నించారు. నయీం బంగారం కూడా కేసిఆర్ తినేసిండన్నారు. ఆ డబ్బుతోనే రేపు తెలంగాణలో కేసిఆర్ ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతున్నాడని ఆరోపించారు.
ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటికి ఒకే సీటు అన్న ఫార్ములా కచ్చితంగా అమలు చేసి తీరాలని తాము ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు సీటు పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బిసిలకు కేటాయించాలని సూచన చేస్తున్నట్లు చెప్పారు.
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని తాను గట్టిగా కోరుతున్నట్లు చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం చేయడం తగదన్నారు. కేసిఆర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చేందుకు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు నాలుగు పైసలు ఖర్చు చేస్తే తప్పేం లేదన్నారు. ఇంకా విహెచ్ ఏం మాట్లాడారో కింద వీడియో ఉంది వీక్షించండి.