గులాబీ రంగు పూసుకున్న పీఆర్ఓ పై వేటు

ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి ప్రచారం చేయకుండా తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటది. కానీ కొంత మంది అధికారులు నిబంధనలను అతిక్రమించి పలానా పార్టీకి  ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. అలా దొరకి పోయి సస్పెన్షన్ కు గురవుతున్నారు. అలా ప్రచారం చేస్తే ఆ నేత గెలిచిన తర్వాత తమకు ప్రమోషన్లో లేక ఇంకా ఏ విధంగానైనా ఉపయోగపడతారనే ఉద్దేశ్యంతో అలా చేస్తున్నారని తెలుస్తోంది.

తాజగా వేములవాడ రాజన్న దేవాలయంలో పిఆర్ఓ గా పని చేస్తున్న ఉపాధ్యాయుల చంద్రశేఖర్ టిఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. వేములవాడ అసెంబ్లీ టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేస్తున్న రమేష్ బాబు కు ఓటు వేయాలని చంద్రశేఖర్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ టిఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రచారం చేయడం పైన జిల్లా కలెక్టర్ కు కొంత మంది ఫిర్యాదు చేశారు.

దీని పై విచారించిన జెసి యాస్మీన్ బాషా చంద్రశేఖర్ టిఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేశారని నిర్దారించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్దమని తేల్చారు. చంద్రశేఖర్ ను సస్పెన్షన్ చేస్తూ జెసి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు ప్రచారం చేయకూడదని ఆయన ఆదేశించారు.  

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు కానీ పార్టీలకు కానీ ప్రచారం నిర్వహించకూడదు. అలా నిర్వహించినట్లైతే వారిని ఎన్నికల నిబంధనలను అతిక్రమించన వారిగా తీసుకొని సస్పెన్షన్ చేస్తారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం తాము ప్రచారం చేసిన నాయకులు గెలిస్తే వారు గెలిచాక ప్రమోషన్లో లేక ట్రాన్స్ ఫర్లు చేయించుకోవచ్చనే ఆశతో చేస్తుంటారని ఆరోపణలున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్టులు చేసిన కూడా వారికి ప్రచారం నిర్వహించినట్టుగానే భావిస్తారు.