టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలి ఉన్న ట్రక్కు, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కారు గుర్తు అందరికి కనిపించేలా బోల్డ్ గా బ్యాలెట్ పేపర్ లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం హామినిచ్చింది.
గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల తమ అభ్యర్ధులు ఓడిపోయారని టిఆర్ఎస్ ఆరోపించింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి దీని పై ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. మరీ ట్రక్కు గుర్తు ఉన్న పార్టీలకు ఎన్నికల సంఘం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.