ప్రగతి సభకు వస్తూ యాక్సిడెంట్ లో టిఆర్ఎస్ కార్యకర్త మృతి

టిఆర్ ఎస్ సభ కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో టిఆర్ ఎస్ కార్యకర్త మరణించాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ దగ్గర చిన్న పెండ్యాల గ్రామం వద్ద టాయిలెట్ కోసం వెళ్లి వస్తున్న టిఆర్ ఎస్ కార్యకర్తను బస్సు ఢికొట్టింది. దీంతో టిఆర్ ఎస్ కార్యకర్త అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన ప్రదేశం NH-202 వ జాతీయ రహాదారి కావడంతో వాహానాలన్ని వేగంగా వస్తుంటాయి.

ప్రగతి నివేదన సభకు వస్తన్న కార్యకర్తల వాహనం పెండ్యాల దగ్గర పక్కకు ఆపుకోగా కార్యకర్త టాయిలెట్ కోసం రోడ్డు పక్కకు వెళ్లాడు. తిరిగి వాహనం దగ్గరకు వస్తుండగా వేగంతో వచ్చిన బస్సు రోడ్డు దాటుతున్న టిఆర్ ఎస్ కార్యకర్తను ఢికొట్టింది. దీంతో కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ప్రగతి నివేదన సభకు వస్తున్న కార్యకర్తల్లో విషాద చాయలు అలుముకున్నాయి. కూటికి రాని సభకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడని పలువురు స్థానికులు అక్కడ చర్చించుకున్నారు.

ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన కార్యకర్త
ప్రమాదానికి కారణమైన బస్సు