వెలిమినేడులో సంచలన వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ వేముల వీరేశం (వీడియోలు)

నకిరేకల్ టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం వెలిమినేడు గ్రామంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వెలిమినేడు లో బుధవారం వీరేశం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చారు. గ్రామంలో కాలుష్య కంపెనీల పై టిఆర్ఎస్ వైఖరి తెలియజేయాలంటూ పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు, గ్రామస్థులు వీరేశం ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వీరేశం గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు.

వెలిమినేడు గ్రామ పంచాయతీ వద్ద ప్రసంగించిన వీరేశం మాట్లాడుతూ… చిల్లర గాళ్లకు, చిల్లర రాజకీయ నాయకలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. పని పాట లేనోళ్లు కంపెనీల వద్ద చందాలు అడుక్కొని దందాలు చేస్తున్నారన్నారు. వెలిమినేడును టిఆర్ఎస్సే అభివృద్ది చేసిందని ఆయన అన్నారు. గ్రామంలో నిరసన తెలిపిన వారిని ఉద్దేశించి ఎన్నికల వరకు వేచి ఉండాలని ఆ తర్వాత అన్ని రాజకీయాలు చేసి బుద్ది చెబుదామని కార్యకర్తలనుద్దేశించి వీరేశం అన్నారు. 

డిసెంబర్ 7 వరకు ఓపిక పట్టండి తర్వాత వారి సంగతి చెబుతామంటూ వీరేశం వ్యాఖ్యలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. వీరేశం వ్యాఖ్యలపై గ్రామస్థులు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడా వీరేశం తన వక్ర బుద్ది పోనిచ్చుకోలేదన్నారు. వీరేశం బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని చిల్లర రాజకీయాలు చేసిందేవరో ప్రజలందరికి తెలుసన్నారు. ఓటు బ్యాంకుతోనే వీరేశానికి తగిన బుద్ది చెబుతామని వారు హెచ్చరించారు. బెదిరింపు రాజకీయాలు వెలిమినేడులో నడవవని పోరాటంలో దుముకులాడిన గడ్డ వెలిమినేడు అని వీరేశం లాంటి వారు ఏం చేయలేరని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరేశం ప్రసంగం వీడియోలు కింద ఉన్నాయి చూడండి. 

 

 

 

veeresham ful speech