నకిరేకల్ టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశంకు నిరసన సెగ తగిలింది. ప్రజల బాధ పట్టని వీరేశంకు ఓటు అడిగే హక్కు లేదంటూ గ్రామస్థులు నిరసన తెలిపారు. వెలిమినేడును ఏం అభివృద్ది చేశావంటూ వారు నిలదీశారు. పర్యావరణంతో గ్రామమంతా ఆగం అయితుంటే కనీసం పట్టించుకోలేదని వారు విమర్శించారు. కంపెనీ తొత్తులుగా వ్యవహరించేవారిని తరిమికొడుతామని వెలిమినేడు ప్రజలు పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటుతో వీరేశం ఖంగుతిన్నాడు. మాట మాట్లడకుండా నిశ్శబ్దంగా పోలీసుల, టిఆర్ఎస్ కార్యకర్తల పహారాలో వెళ్లిపోయాడు.
https://www.youtube.com/watch?v=miO_NsTIook
ప్రజల ఆందోళనతో కనీసం సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే తప్పించుకొని దొంగలా పారిపోయాడని పర్యావరణ సమితి సభ్యుడొకరు తెలిపారు. ప్రజల ఆందోళనతో ఎమ్మెల్యే సందులల్ల తిరిగి కార్యకర్తల సెక్యూరిటితో ప్రచారం చేసినట్టు తెలిసింది. టిఆర్ఎస్ వర్గీయులు, విపక్ష సభ్యులు పోటాపోటి నినాదాలు చేసుకోవడంతో వెలిమినేడులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వీరేశాన్ని ఘోరావ్ చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.