టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ సెగ (వీడియో)

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి గట్టి సెగ తాకింది. నల్లగొండ జిల్లాలోని హాలియా లో జగదీష్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి చదవండి. చూడండి.

 

హాలియా నగర పంచాయతీ గా అవతరించిన నేపథ్యంలో గురువారం నగర పంచాయతీ ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితోపాటు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటిసి అయిన యెడవెల్లి నాగమణి (దళిత మహిళా నేత) కు ఆహ్వానం పంపారు. అందరితోపాటు ఆమె కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ ఆమెను వేదిక మీదకు ఆహ్వానించలేదు. పక్కన నిలబెట్టారు.  ప్రొటోకాల్ ప్రకారం జెడ్పీటిసి ని వేదిక మీద కూర్చోబెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు సభలో ఆందోళనకు దిగారు. అయితే ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి వారిపై ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ లో సభ్యత్వం ఉన్నవారికే ప్రొటోకాల్ ఉంటుందంటూ సెటైర్ వేశారు. మంత్రి కామెంట్స్ పై కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభా ప్రాంగణంలో ఉద్రికత్త నెలకొంది. 

దళిత మహిళా జెడ్పీటిసిని టిఆర్ఎస్ సర్కారు అవమానించిందంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక మీద ఏ ప్రోటోకాల్ లేని నోముల నర్సింహ్మయ్యను కూర్చోబెట్టి జెడ్పీటిసిని పక్కన నిలబెట్టిన టిఆర్ఎస్ సర్కారుకు మహిళల పట్ల ఉండే సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. 

ఈ అలజడి రేగడంతో జిల్లా కలెక్టర్ ప్రేక్షక పాత్ర వహిస్తూ సైలెంట్ గా కూర్చున్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.