కేబినెట్ స్పెషల్ ఐటమ్ గా సెర్ప్ ఉద్యోగుల డిమాండ్స్

కేబినెట్ లో స్పెషల్ ఐటమ్ గా సెర్ప్ సిబ్బంది పే స్కెలు అంశం చేర్చినట్లు సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి  కేసిఆర్ అనుమతి తో కేబినెట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారని వారు తెలిపారు. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో సెర్ప్ ఉద్యోగుల వేతన సవరణ అంశం ప్రత్యేక ఎజెండా గా చేర్చినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు జెఎసి నేతలతో వెల్లడించారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న సెర్ప్ సిబ్బంది వేతన సవరణ అంశం ముఖ్యమంత్రి అనుమతి తోనే నేటి కేబినెట్ సమావేశంలో ఎజెండా లో చేర్చామన్నారు.

4258 మంది సిబ్బందికి రు.84కోట్ల తో పేస్కెలు వర్తింపు చేయాలని సెర్ప్ జెఎసి ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. కాగా అధికారులు 54కోట్ల తో ఒకటి, జెఎసి కోరినట్లుగా 84కోట్ల తో రెండో ప్రతిపాదన, 104 కోట్ల రూపాయలతో మూడో ప్రతిపాదనలతో కూడిన డ్రాఫ్టు ఫైలు పంపారని మంత్రి వెల్లడించినట్లు వారు తెలిపారు. ఈ మూడు ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా నిర్ణయాధికారం ముఖ్యమంత్రి కి అప్పగిస్తూ క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారన్నారు. ఆదివారం ప్రగతి నివేదన సభ ఉన్నందున రేపు ఈ ప్రతిపాదనపై నిర్ణయించి, 4న లేదా 5న జరిగే తదుపరి క్యాబినెట్ సమావేశంలో అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా కు వెళ్ళడిస్తారని జూపల్లి కృష్ణారావు జెఎసి నేతలకు తెలిపారు. 

ఇదిలావుండగా, ఈరోజు ఉదయం ఎంపి కవిత హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని తన స్వగృహంలో వివిధ జిల్లాల నుండి రాష్ట్ర  జెఎసి ఆధ్వర్యంలో 120కి పైగా భారీగా తరలివచ్చిన సెర్ప్ సిబ్బంది తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిన్ననే ముఖ్యమంత్రి కి సెర్ప్ సిబ్బంది వేతన సవరణ కు సంబంధించిన ప్రతిపాదనలు చేరాయని, ఈరోజు  కేబినెట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టనున్నారని  ఆమె వెల్లడించారు.

సెర్ప్ ఉద్యోగులకు అభివాదం చేస్తున్న ఎంపి కవిత

నవంబర్ నెలలో సమ్మె అనంతరం విరమణ సమయంలో మంత్రి ఇంటివద్దకు వచ్చి తాను స్వయంగా హామీ ఇచ్చానని, తాను ఇచ్చిన హామీ నెరవేరవరకు కృషిచేస్తానని, అందులోభాగంగానే సెర్ప్ సిబ్బంది ఫైలు ముఖ్యమంత్రి కి చేర్చినట్లు కవిత వారికి వివరించారు. అధికారికంగా అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాయన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించడమే మిగిలిందని, 2,3 రోజులు ఒపికగా ఉండాలని సూచించారు.

నేటి క్యాబినెట్ లో సెర్ప్ సిబ్బంది అంశం ఎజెండా లో చేర్చే క్రమంలో మంత్రి కేటిఆర్ ప్రత్యేక చొరవ చూపారని రాష్ట్ర జెఎసి నేతలు పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితం సెర్ప్ జెఎసి దీక్ష నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి కేటిఆర్ ప్రత్యేక చొరవ తో సెర్ప్ సిబ్బంది అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని ఇందుకు కేటిఆర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.  ఎంపి కవిత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు శాఖా పరంగా ఐఎఎస్ అధికారుల తో తగిన చర్యలు తీసుకుని నాలుగున్నర సం.ల తర్వాత మొట్టమొదటి సారి సెర్ప్ ఫైలు ముఖ్యమంత్రి వద్దకు క్యాబినెట్ ద్వారా చేరిందన్నారు. వారిరువురికి జెఎసి తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ క్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తమవంతు సహకారాన్ని అందించారని జెఎసి నేతలు తెలిపారు. మరోపక్క నేడు క్యాబినెట్ లో సెర్ప్ సిబ్బంది అంశం ప్రవేశ పెట్టిన విషయాన్ని మంత్రి హరీష్ రావు కూడా  జెఎసి ఆఫీస్ బేరర్స్ధ్రు వీకరణ చేశారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి జెఎసి  సమావేశం లో తీర్మానించిన ప్రకారం 4వ తేదీ వరకు లాబీయింగ్ రూపంలో ప్రయత్నించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎంపి కవితను కలిసిన సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు

మంత్రులు పేర్కొన్నట్లు క్యాబినెట్ 4/5వతేది రాత్రి లోపు పరిష్కారం కాకపోతే మెరుపు దీక్ష కు దిగేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉందని జెఎసి ఆఫీస్ బేరర్స్ పేర్కొన్నారు. నేటి పరిణామాల నేపథ్యంలో సిబ్బంది అందరూ విశ్వాసం తో ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. నాలుగున్నర సం.ల తర్వాత సెర్ప్ సిబ్బంది 84 కోట్ల బడ్జెట్ అంశం క్యాబినెట్ ఎజెండా ద్వారా ముఖ్యమంత్రి చేతిలోకి తీసుకెళ్లడం లో సెర్ప్ సిబ్బంది, జెఎసి ఆఫీస్ బేరర్స్ సాధించిన పాక్షిక సమిష్టి గా విజయంగా భావించాలన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో పరిష్కారం దక్కుతుందని జెఎసి తరపున ఆఫీస్ బేరర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ సిబ్బంది ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకండని పిలుపునిచ్చారు. నిన్నటినుంచి హైదరాబాద్ లో ఉన్న వివిధ జిల్లాల ఆఫీస్ బేరర్స్ ఇపుడు ఇంటికి వెళ్లి, 4వతేది మధ్యాహ్నం హైదరాబాద్ కు రావాలని రాష్ట్ర సూచించింది. సోమవారం సాయంత్రం మరింత సమాచారం అందించనున్నట్లు రాష్ట్ర జెఎసి పేర్కొంది.