అమృతను పరామర్శించిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి

ఇటీవల మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ హత్యోదంతాన్ని రాష్ట్ర విద్యుత్ మరియు యస్ సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం మిర్యాలగూడలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు భార్య అమృత వర్శినిని పరామర్శించారు.

అమృతకు చెక్ అందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు.నిందితులను కఠినంగా శిక్షించే విదంగా కేసులు నమోదు చేయాలని సంఘటన జరిగిన వెంటనే అధికారులను ఆదేశించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పరువు హత్యగా ప్రచారం జరుగుతున్న ప్రణయ్ హత్యోదంతం ముమ్మాటికీ పరవు తక్కువ సంఘటనని ఆయన అభివర్ణించారు.

ప్రణయ్ ఫొటోకు దండ వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి

ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవరించడం తో పాటు భర్తను కోల్పోయిన అమృతవర్శినికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జరిగిన సంఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రణయ్ కుటుంబసభ్యులను ఓదారుస్తున్న మంత్రి జగదీష్, చిత్రంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్

ప్రభుత్వ పరంగా భర్తను కోల్పోయిన అమృతవర్శినిని ఆదుకునేందుకు గాను 8 లక్షల 25 వేల ఆర్ధిక సహాయం అందించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు ….అందులో భాగాంగా ఈ రోజు 4 లక్షల 12 వేల రూపాయల మొత్తాన్ని చెక్ రూపంలో అమృతకు మంత్రి అందజేశారు.
అంతే గాకుండా యస్ సి అభివృద్ధి శాఖానుండి అమృతవర్శినికి వ్యవసాయ భూమి ,రెండు పడకల ఇల్లు ,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.

అమృతకు ధైర్యం చెబుతున్న మంత్రి జగదీష్ రెడ్డి

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసనసభ్యులు భాస్కర్ రావు ,తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, యస్ పి రంగానాధ్, మిర్యాలగూడ ఆర్డిఓ జగన్నాధ రావు, టిఆర్ఎస్ నేత తిరునగరి భార్గవ తదితరులు పాల్గొన్నారు.

అమృతకు సర్కారు అండగా ఉంటుందని బరోసా ఇచ్చిన మంత్రి

ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్

ప్రణయ్ హత్య దూరదృష్టకరం. 

ఇది హేయమైన చర్య.

అనాగారికంగ చేసి పరువు పోగొట్టుకున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తుంది.

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఈ సంఘటన పరువు తక్కువది.

ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు భార్య అమృతవర్శినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.

నిందితులను కఠినంగా శిక్షించేవిదంగా చర్యలు.

అమృతవర్శినికి ప్రభుత్వం అండగా ఉంటుంది. 

భర్తను పోగొట్టుకున్న అమృతవర్శినికి ప్రభుత్వ ఉద్యోగం.