మంత్రి హరీశ్ రావ్ టిఆర్ ఎస్ పార్టీకి ట్రబుల్ షూటర్ అయ్యారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడల్లా ఆయన ప్రత్యక్షమయి పార్టీ పరువు కాపాడుతుంటారు. పార్టీ కిందిస్థాయిలో ఆయనకు ఉన్న పలుకుబడి, గౌరవం అలాంటివి. ఈ మధ్య పార్టీ లో చెలరేగిరన అసమ్మతిని ఆర్పడంలో ఆయన పెద్ద పాత్ర పోషించారు. హరీష్ రావు రాయబారం వల్లే పార్టీ లో టికెట్ల పంపకంతో వచ్చి న అసంతృప్తి సద్దుమణిగిందని చెబుతున్నారు. టిఆర్ ఎస్ లో అసంతృప్తితీవ్ర స్థాయిలో ఉంది. దీనితో చాలా మంది పార్టీని వీడిపోతున్నారు. ఇపుడు వాళ్లందరిని వెనక్కి తెచ్చెే బాధ్యత కూడా హరీష్ రావు మీద పడింది. ఆయన ఈ పనిని విజయవంతంగా నెరవేర్చి పార్టీని వీడిన వారందరిని వెనక్కి తెస్తున్నారు. దీనితో కాంగ్రె స్ లో చేరి 24 గంటలు కాకముందే మళ్లీ సొంత పార్టీలో వస్తున్నారు. ఈ సంఘటన చూడండి.
తాజాగా గజ్వేల్ మాజీ ఎంపీపీ ఎంసీ రాజయ్య ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. 24 గంటలు కాకముందే, సోమవారం ఉదయం రంగంలోకి దిగి రాజయ్యతో చర్చలు జరిపి తిరిగి టిఆర్ ఎస్ గూటికి చేర్చడంలో హరీష్ రావు చక్రం తిప్పారు.
అసలు రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి ముందు అనేక పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. టిఆర్ ఎస్ లో సరైన గుర్తింపు దక్కడం లేదని గత కొంత కాలంగా రాజయ్య అసంతృప్తితో ఉన్నారని దీని పై టిఆర్ ఎస్ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినప్పటికి కూడా అవి ఫలించకపోవడంతో రాజయ్య ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. విషయం తెలుసుకున్న మంత్రి హారీష్ రావు రాజయ్య నివాసానికి వెళ్లి చర్చించారు. కండువా కప్పి టిఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. దీంతో శాంతించిన రాజయ్య మంత్రితో పాటు గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
సీఎం స్వంత నియోజకవర్గంలో టిఆర్ ఎస్ లో లుకలుకలు కలవరం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే కొంత మంది నేతలు కాంగ్రెస్ లో చేరడంతో వారితో కూడా చర్చించి హారీష్ రావు తిరిగి వారిని టిఆర్ ఎస్ లోకి చేర్చారు. ఇలా పలు రకాలుగా నేతలు జంపు అవుతుండటంతో టిఆర్ ఎస్ పెద్దలకు తల నొప్పిగా మారింది. సీఎం స్వంత నియోజకవర్గంలోనే ఇంత అసంతృప్తి ఉంటే ఆ దెబ్బ రాష్ట్రమంతా పడే ప్రభావం ఉంటుందని నేతలు అయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వారానికి కొంత మంది కాంగ్రెస్ లో చేరుతుండటంతో నేతలు బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.