ఇదే మంచి తరుణం..కేసీఆర్‌ను దిగ్బందించడానికి రెడీ అయిన తెరాస నేతలు 

TRS leaders trap to KCR

వరుసగా దుబ్బాక ఉప ఎన్నికల ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో  అనూహ్యరీతిలో సీట్లు తగ్గిపోవడం వంటి దెబ్బలు కేసీఆర్‌ను కష్టాల్లోకి నెట్టేశాయి.  ఇన్నాళ్లు తన కోట దుర్భేధ్యమైనదని భావించి ప్రతిపక్షాలను చిన్న చూపు చూస్తూ వచ్చిన అయన ఇప్పుడు బాగా అలర్ట్ అయ్యారు.  అధికార పార్టీ ఇలా ఒక్కసారి కిందకి జారడంతో  ప్రతిపక్షాలు ఊపందుకున్నాయి.  బీజేపీ ఇక భవిష్యత్తు తమదే అంటుంటే కాంగ్రెస్ ఓడిపోయినా కూడ కష్టపడితే బీజేపీ తరహాలో బలపడవచ్చని ఆశాభావంతో ఉంది.  అయితే ఇలాంటి ఆశలే తెరాసలో కొందరు నేతల్లో సైతం చిగురిస్తున్నాయట.  ఇంతకుముందు ముఖ్యమంత్రిని గట్టిగా అడగడానికి ఎంతటి నేత అయినా సంకోచించేవారు.  

TRS leaders trap to KCR
TRS leaders trap to KCR

కారణం.. బలం.  తాను సంపూర్ణ బలవంతుడనని, పార్టీలో తన మాటే శాసనం అన్నట్టు ఉండేవారు కేసీఆర్.  తనకై తాను చెప్పడం తప్ప నేతలు ఏ విషయంలోనూ డిమాండ్ పెట్టరాదు అన్నట్టు ఉండేది వాతావరణం.  కానీ బీజేపీ ఇచ్చిన షాకులతో ఆ పరిస్థితిలో కూడ మార్పులు కనిపిస్తున్నాయి.  ఇన్నాళ్లు నోరు మెదపని గులాబీ నేతలు ఇప్పుడు పట్టు బిగించాలని అనుకుంటున్నారు.  భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలకు సంసిద్ధమయ్యే పనుల్లో భాగంగా తెరాస, కాంగ్రెస్ పార్టీల నేతలను ఆకర్షిస్తోంది,  సంతృప్తిటి ఉన్నవారిని తమవైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తోంది.  బయటకు రావట్లేదు కానీ కొందరు అధికార  పార్టీలోని కొందరు అసంతృప్తులు బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారట.  అందుకే వారిని ఆపడం కోసం కేసీఆర్ పదవుల పంపిణీ మొదలుపెట్టారు.  

రెండవసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆగిపోయింది. పదవీకాలం ముగిసి పలు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.  40కిపైగా కార్పొరేషన్లకు పాలకవర్గాలు లేవు.  వాటిలో ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, టెక్నాలజీ సర్వీసెస్‌  ఆర్టీసీ, బీసీ, మహిళా కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ, బేవరేజెస్‌ వంటి కార్పొరేషన్లు ఉన్నాయి.  వీటి మీద ఆశలు పెట్టుకున్న ఆశావహులు ఎంతోమంది ఉన్నారు.  నెలల తరబడి నేతల చుట్టూ తిరుగుతున్నా కేసీఆర్ భర్తీ గురించి పట్టించుకోలేదు.   అయితే ఇప్పుడు కిందకు దిగొచ్చారు కాబట్టి నియామకాలు చేపట్టనున్నారు.  దీన్ని గమనించిన ఇంకొందరు నేతలు ఎమ్మెల్సీ పదవుల మీద కన్నేశారు.  ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడినవారు, గతంలో ఎమ్మెల్సీ హామీని పొందినవారు ఈసారి ఖాళీకానున్న 7 పదవులను దక్కించుకోవడానికి సూపర్ ప్లాన్ వేశారు. 

అనుచరుల ద్వారా తాము అసంతృప్తిలో ఉన్నామనే విషయాన్ని కేసీఆర్ వద్దకు చేరవేస్తున్నారు.  వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి దక్కకుంటే కేడర్ ను తీసుకుని బయటికి వెళ్లిపోతామని, బీజేపీలో చేరతామనే హింట్లు ఇస్తున్నారు.  అంటే వీరంతా ఇప్పుడు పార్టీని వీడుతామంటే అసలే ఓటమి భారంతో ఉన్న కేసీఆర్ వేరే దారి లేక వారి డిమాండ్లకు తలొగ్గి పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవికి హామీ ఇస్తారనేది వారి స్కెచ్.  మరి కేసీఆర్ ఆ స్కెచ్లో ఇరుక్కుంటారో లేదో చూడాలి.