టిఆర్ ఎస్ నేతల్లో ‘బతుకమ్మ’ టెన్షన్…

టిఆర్ ఎస్ లో టెన్షన్ మొదలయింది. ఎన్నికల ముందు  రెండు  భారీ  పండగలను  పింక్ పార్టీ  జరుపుకోలేకపోతున్నది. ముందస్తు దెబ్బ వల్ల అక్టోబర్ 12నుంచి  పండగ లాాగా  పంచాలనుకున్న బతుకమ్మ చీరెల పంపకం జరుుతుందో లేదో చెప్పలేని పరిస్థితి వచ్చింది.  ఈ పండగను  280 కోట్లరుపాయలు ఖర్చు పెట్టి ఘనంగా వూరూర జరపాలనుకున్నారు. ఎన్నికల ముందు జరుగుతుంది కాబట్టి కనీసం 90 లక్షల వోట్లు గ్యారంటీ అనుకున్నారు.  ఎందుకంటే,  ప్రభుత్వం 90 లక్షల చీరెలను తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేశారు. ఇవి జిల్లాలకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 50 లక్షల చీరెలు జిల్లాలకు వెళ్లిపోయాయి. రెండు రోజుల కిందట హైదరాబాద్ ఈ చీరెల  ప్రదర్శన జరిగింది. కెటి రామారావు చీరెలకే తిలకించారు.   ఈ కార్యక్రమంలో ప్రతి టిఆర్ ఎస్ అభ్యర్థి స్వయంగా పాల్గొన్ని మహిళలకు చీరెలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇలాగే మరొక 45 లక్షల ఓట్లమీద టిఆర్ ఎస్ గురి పెట్టింది ఇంకో కోణం నుంచి . రైతు బంధు కింద ఎకరానికి నాలుగువేల చొప్పున మరొక 45లక్షల మందికి చెక్కులను తెరాస పండగలాగా పంపిణీ చేసి ఓట్లడగాలనుకున్నారు. ఇవన్నీ కూడా దాదాపు కానుకలకిందికే వస్తాయని, అసెంబ్లీ రద్దయింది కాబట్టి టిఆర్ ఎస్ సభ్యులెవరూ ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా చూడాలని  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ విజ్జప్తి చేసింది. అంతేకాదు, ఈ చీరెలను చౌకదుకాణాలను ద్వారా పంపిణీ చేయవచ్చని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్నందున టిఆర్ ఎస్ నాయకులు ఎవరూ పాల్గొనకుండా చూడాలని కాంగ్రెస్ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు.

అంతేకాదు, ఈ విషయంలో అవసరమయితే కోర్టును కూడా ఆశ్రయిస్తామని, ఈచీరెల మీద కెసిఆర్ బొమ్మకూడా ఉండటానికి వీళ్లేదని కాంగ్రెస్ అంటున్నది.

దీనితో  280 కోట్ల రుపాయల విలువయిన చీరెలు పార్టీకి ఎలాంటి ప్రచారం లేకుండా పంపిణీ చేయాల్సి వస్తున్నదే బెంగ టిఆర్ ఎస్ నేతల్లో కనబడుతుంది. రంగురంగల చీరెలను పంచి, పేజీలకు పేజీలు అడ్వర్టియింజ్ మెంట్లు గుప్పించి టిఆర్ ఎస్ ప్రముఖలు టివిలు న్యూస్ పేపర్లలో కనిపించే వాళ్లు.ఇపుడా అవకాశం లేకుండా పోతున్నది.  దీనికి కారణం కాంగ్రెసే అనే అక్కసుకూడా పింక్ సైన్యంలో కనిపిస్తూ ఉంది. ఆ అక్కసు నల్గొండ ఎంపి గుత్తా సుఖేంద్ రెడ్డి చాలా స్ఫష్టంగా వ్యక్తం చేశారో చూడండి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ముసుగులో రెండో  రైతుబంధు చెక్కులు  రైతులకు అందకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రమంతా ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని, ఒక్క నల్గొండ జిల్లాలోనే ముగ్గురున్నారని ఎద్దేవా చేస్తూ వారికి ఇలా అడ్డుకోవడం తప్ప మరొక పని లేదని అన్నారు. తిప్పర్తి, కనగల్, పెద్దావూరా మండలాల్లో గుత్తా పార్టీ అభ్యర్థులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహయ్య ల ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూచెక్కుల పంపిణీని, చీరెల పంపిణీని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డిలను మహిళలను, రైతులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

  ‘ఏ కారణం చేతనైనా రైతులకుచెక్కులు,  పేద మహిళలకు బతుకమ్మ చీరెల  పంపిణీ ఆగితే దానికి కాంగ్రెస్ నేతలే కారణం అని గుర్తుపెట్టుకోవాలి.  కాంగ్రెస్ కుట్రలను లెక్క చేయకుండా ఆక్టోబర్‌లో బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కుల పంపిణీ చేస్తుంది,’ అని ఆయన చెప్పారు. అయితే, ఎందుకయినా మంచిదని  కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రచారం చేయడంమొదలు పెట్టింది.

(ఫీచర్ ఫోటో: గత ఏడాది  బతుకమ్మ చీరెల పంపిణీ నాటిది)