టిఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని మానేరు జలాశయంలో స్పీడ్ బోటును పరీశీలించి దిగుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వీడియో కింద ఉంది చూడండి.
గంగుల కమలాకర్ కొత్తగా వచ్చిన స్పీడ్ బోటులో ప్రయాణించి ఒడ్డుకు చేరుకున్న అనంతరం దిగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అక్కడ లోతు తక్కువగా ఉండటం, ఆయన లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. సహచరులు కమలాకర్ ను ఒడ్డుకు చేర్చారు.