భార్యని కాపురానికి పంపలేదని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిపై దాడి చేసిన భర్త… అసలేమైందంటే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చినప్పుడు కొందరు భార్యలు భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళుతుంటారు. ఇలాగే ఒక యువతి హింసలు భరించలేక పుట్టింటికి చేరుకుంది. అయితే భార్యను కాపురానికి పంపించడం లేదని కక్ష పెంచుకున్న అల్లుడు వారిపై దాడికి పాల్పడేట ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరొక ఇద్దరు స్వల్ప గాయాలతో భయపడ్డారు . వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

వివరాలలోకి వెళితే…రామచంద్రపురం కాలనీకి చెందిన మహేష్, ఎల్లమ్మ దంపతుల కుమార్తె ఆలకుంట్ల మనిషాకు మూడేళ్ల క్రితం రాజు అన్ వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత వరకట్నం కోసం భర్త వేధిస్తున్న కారణంగా మనిషా తన తల్లి వద్దనే ఉంటోంది. అయితే సోమవారం మనీషా వద్దకు వెళ్లిన రాజు.. కాపురానికి వస్తావా రావా అంటూ నానా బూతులు తిడుతూ ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో భరత్ అనే వ్యక్తి.. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిన తర్వాత మనీషాను తీసుకెళ్లాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలోనే భరత్, మనీషా పెద్ద నాన్న తో రాజు గొడవకు దిగి వాళ్లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ దాడిలో గాయాలపాలైన వారు దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని తిరిగి వస్తుండగా రాజు కొందరు వ్యక్తులతో కలిసి కొడవళ్ళు, గొడ్డలితో ఆస్పత్రి ఆవరణలోనే వారిపై మరి అలా దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మనీషా పెదనాన్న వెంకటనర్సు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే వెంకటనర్సు ఇద్దరు కుమారులు కూడా ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. వెంకట నర్సి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన రాజు సహా మరొక్క ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.