హైదరాబాద్ ఘటన మరవకముందే నందిపేటలో దారుణం.. ప్రియురాలి కోసం స్నేహితుడి హత్య..!

తాజాగా హైదరాబాదులో ఒక యువతి కోసం యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తాను ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో నవీన్ అనే యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసి శరీరం నుండి గుండె, మర్మాంగాలు వేరు చేసి ప్రియురాలికి ఫోటోలు పంపించాడు. ఈ ఘటనతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఈ ఘటన మరువకముందే నండిపేటలో ఇటువంటి దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే…నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం ఆంధ్రానగర్‌లో ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్యోదంతం బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రానగర్‌ జీపీ పరిధిలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన సౌతూరి కార్తీక్‌ (21) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు . అయితే గత సెప్టెంబర్‌ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లిన కార్తిక్ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా విస్తీ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కార్తీక్ కి అదే గ్రామానికి చెందిన బాపట్ల రాజు అనే యువకుడు స్నేహితుడు. రాజు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే కార్తీక్‌ కూడా అదే యువతిని ప్రేమిస్తున్నాడనే కార్తీక్ మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు రాజు కార్తీక్ మీద పగ పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా కార్తీక్ అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో తన తమ్ముడు హరీశ్‌తో కలిసి నందిపేట్‌, విజయనగర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కార్తీక్‌కు కల్లు తాగించారు. కార్తీక్ మత్తులోకి వెళ్లాక విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని రాళ్లల్లో పడేసి, ఇంటికి వచ్చేశారు. ఈ విషయం ఇటీవల కార్తీక్‌ స్నేహితులకు తెలిసింది. .