సూర్య భగవానుడికి పూజలు అందుకే లేవా.. నమ్మలేని నిజాలు మీ కోసమే!

ఈ సృష్టిలో ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని భావిస్తారు. మరి ప్రత్యక్షంగా కనబడే సూర్యుడికి పూజలు ఎందుకులేవో చాలామందికి అర్థం కాదు. ఈ భూమి మీద ఉన్న అన్ని ఆలయాలలో క్రమం తప్పకుండా పూజలు జరుగుతాయి. కానీ ఒక్క కోణార్క్ సూర్య దేవాలయంలో పూజలు ఎందుకు చేయరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. అలాగే ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయానికి కూడా ఒక చరిత్ర ఉంది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహ దేవుడు అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. దీని నిర్మాణం 1236 నుండి 1264 వరకు జరిగింది. ఈ ఆలయాన్ని మొత్తం నల్లటి గ్రానైట్ బండలతో నిర్మించారు. దీని నిర్మాణం రథం లాగా ఉంటుంది. ఇందులో ఏడు అశ్వాలు లాగుతున్నట్టుగా, 12 జతలు అంటే 24 చక్రాలు ఉంటాయి. ఇంకా పద్మం, కలశం చాలా గొప్పగా చెక్కబడి ఉంటాయి. ఇందులోని ఒక్కొక్క చక్రం రోజులోని ఒక్కొక్క గంటను తెలియజేస్తుంది.

ఈ ప్రాంతంలో ఉన్న ఇసుక బంగారు రంగులో ఉంటుంది. కజరంగా దేవాలయంలో మాదిరిగానే ఇక్కడ శృంగార బొమ్మలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. సూర్యుడి లోని ఏడు వర్ణాలకు ఇక్కడ ఉండే ఏడు అశ్వాలు ప్రతీక. ఉదయం సూర్య రశ్మి దేవాలయంలోని మూలవిరాట్ పై పడుతుంది. ఇక్కడ ఉండే 24 రథచక్రాలు సూర్యుని కాలానికి ప్రతీకలు. ఇక గర్భగుడి పై భాగంలో 52 టన్నుల అయస్కాంతం ఉంటుంది దీని ద్వారా విగ్రహమైన మూలవిరాట్ గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది. అప్పట్లో విదేశీయులు ఈ అయస్కాంతం వల్ల నౌకల, ఓడల ప్రయాణానికి అంతరాయం ఏర్పడుతుంది అని ఆ దేవాలయాన్ని కూల్చివేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే సూర్యుడు, అర్కుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించడం జరిగింది.

ఇక్కడ ఉన్న ఐదు పుణ్యక్షేత్రాల మధ్యనున్న ప్రాంతంలో సూర్యుడు వెలసడం వల్ల ఆ ప్రాంతానికి కోణార్క్ అనే పేరు వచ్చిందని సమాచారం. జాంబవతి కుమారుడైన సాముడు చాలా అందగాడు. అహంకారం కూడా చాలా ఎక్కువ ఒకసారి నారదుడిని అవమానిస్తాడు సాముడు. నారదుడు, సాముడిని అమ్మాయిలు స్నానం చేసే కొలను దగ్గరికి తీసుకు వస్తే సాముడు అక్కడ ఉన్న అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు కుష్టివానిగా మారిపో అని శాపం ఇస్తాడు. తన తప్పు తెలిసిన సాముడు శాపవిమోచనం అడగక కోణార్క్ సమీపంలోని సూర్యదేవాలయంలో తపస్సు చేయమని చెప్పగా , అక్కడున్న చంద్రయానలో స్నానం చేసి 12 సంవత్సరాలు సూర్యతపస్సు చేసి శాపవిమోచనం పొందుతాడు.

ఆ సమయంలో అతనికి ఒక సూర్య విగ్రహం సముద్రంలో లభిస్తుంది. అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపడతాడు. తర్వాత ఆ విగ్రహం కనపడకుండా పోయింది. ఇప్పుడున్న విగ్రహం వేరేది అని స్థానికుల అభిప్రాయం. ఇంత గొప్ప ఆలయంలో పూజలు చేయ పోవడానికి కారణం ఏంటంటే నరసింహ రాజు ఆలయ గోపురం పై అయస్కాంతాన్ని అమర్చాలి అంటే అక్కడున్న పనివాళ్ళు సాధ్యపడదు అంటారు. అప్పుడు ఆగ్రహించిన నరసింహ రాజు రేపటి ఉదయంలోగా పని పూర్తి కాకపోకపోతే మిమ్మల్ని అంతం చేస్తాను అంటాడు.

ప్రధాన శిల్పాకారుడు అయిన విశ్వ మహా కుమారుడు ధర్మపతో ఆ విషయం విని నేను ఆ పనిని పూర్తి చేస్తాను అంటూ ఉదయంలోపు ఆ పనిని పూర్తి చేస్తాడు. ఒక చిన్న పిల్లవాడు ఈ పనిని పూర్తి చేశాడంటే అవమానకరం అంటూ అక్కడున్న శిల్పాకారులు తనని ఏమైనా చేస్తారేమో అని దేవాలయం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. నరసింహారాజు అయస్కాంతాన్ని గుడిలో అమర్చినందుకు చాలా సంతోషిస్తాడు. కొంతకాలం తరువాత అక్కడ జరిగిన ఆత్మహత్య విషయం తెలిసి ఆ గుడిని మూసివేస్తాడు. అప్పటినుండి అక్కడ పూజలు జరగవు.