TG: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే ఈ సమావేశం ప్రారంభం కాగానే ముందుగా మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటించారు ప్రస్తుతం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు సంతాపం తెలియజేశారు. సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కూడా ఈయన తీర్మానం చేశారు. ఈ సమావేశాలలో రేవంత్ తీర్మానానికి కేటీఆర్ సైతం మద్దతు తెలియజేశారు. ఇక ఈ సమావేశాలలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆయన తెలిపారు.
60 సంవత్సరాల తెలంగాణ కలను సాకారం చేసినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ నూతన గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేశారు ఇక తెలంగాణ అంటే మన్మోహన్ సింగ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపినట్లు రేవంత్ వెల్లడించారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరువలేమంటూ రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఇక ఈ సమావేశాలలో భాగంగా కేటీఆర్ కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. మన్మోహన్ సింగ్ ఎంతో నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి తనని ఎన్ని అవమానాలు చేసిన వాటిని పట్టి కింద బిగించి అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ ఆయన సేవలను కొనియాడారు.