తెలంగాణలో ఆనందమయినా ఆవేదనయినా పాట రూపం తీసుకుంటుంది. తెలంగాణ నేల మీదప్రతిమనిషి ఒక వాగ్గేయకారుడే. పాటని అలా అల్లేసి, ఇలా ఆలపించి బాధని వ్యక్తం చేస్తారు. ఆనందాన్ని పంచుకుంటారు. తెలంగాణ ఉద్యమంలోకి మూల మూల నుంచి ఇంటింటినుంచి ప్రజలందరిని లాక్కొచ్చింది జెఎసిలు ఏర్పాటుచేయించింది మేధావుల ఉపన్యాసాలుకాదు. అలగా జనం పాటలే. ఇలాంటి పాటగాళ్లలో ఒక ఆణి ముత్యం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన గుర్రపు రాము. ఆయన
గల్ఫ్ ఏజంట్ల మోసాలపై, పల్లె సమస్యలపై, ప్రభుత్వ పాఠశాలల పై మూడు పాటలని వినిపిస్తున్నారు.