కేసీఆర్ ని వదిలేసేవేం మహేష్!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో కేటీఆర్‌కు‌ సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘విజయం సాధించినందుకు అభినందనలు కేటీఆర్‌. ఈ విజయానికి నువ్వు అర్హుడివి. ప్రజల వ్యక్తిగా కొనసాగు.. ఆల్‌ ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు.

అయితే మహేష్ బాబు కేవలం తన స్నేహితుడు అయిన కేటీఆర్ ని ఉద్దేశించి అభినందనలు చెప్పటం కేసీఆర్ అభిమానులకు నచ్చటం లేదు. తమ గులాబి బాస్ కు కూడా విషెష్ చెప్తే బాగుండేది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ కు చెప్పినా,కేసీఆర్ కు చెప్పినా టీఆర్ ఎస్ కు చెప్పినా ఒకటే కదా.

ఇదే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యవర్గం (‘మా’) కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పింది.

‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన కేసీఆర్‌కు అభినందనలు. తెరాస ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉంది. ‘మా’ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా మా ముందు ఓ పెద్ద బాధ్యత ఉంది. ‘గోల్డేజ్ హోమ్’ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలను కుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్‌ల సహకారం లభిస్తుందని భావిస్తున్నా. ఒకసారి మాట ఇస్తే దాని మీద నిలబడే వ్యక్తి కేసీఆర్, ఆ నమ్మకం మాకు ఉంది’

అనంతరం బెనర్జీ ప్రసంగిస్తూ.. ‘అనేక సంవత్సరాలపాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్. ఆయన నాయకత్వం మీద నమ్మకంతోనే రెండోసారి కూడా ప్రజలు పట్టం కట్టారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరినీ కేసీఆర్ బాగా చూసుకుంటారని నమ్మకం ఉంది’ అని బెనర్జీ తెలిపారు.